News


పదేళ్లలో అతిపెద్ద ర్యాలీ ఇదే..!

Friday 20th September 2019
Markets_main1568972407.png-28459

  • 2279 లాభపడ్డ సెన్సెక్స్‌
  • 578 పాయింట్లు పెరిగి నిఫ్టీ

మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజ పరిచేందుకు కేంద్రం ప్రకటించిన ఉద్దీపన చర్యలతో గురువారం సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు దశాబ్దంలోనే అతిపెద్ద ర్యాలీని చేశాయి. దేశీయ కంపెనీల కార్పోరేట్‌ పన్ను 33శాతం నుంచి 22శాతం తగ్గించడం, కొత్త కంపెనీల కార్పోరేట్‌ పన్ను 25శాతం నుంచి 15శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటించారు. ఆర్థిక మంత్రి ప్రకటన అనంతరం మార్కెట్లో వెల్లువెత్తిన కొనుగోళ్లతో సూచీలు అడ్డూ అదుపు లేకంగా పరుగులు పెట్టాయి. ఒకదశలో సెన్సెక్స్‌ 2279 పాయింట్లు పెరిగి 38,378.02 వద్ద, నిఫ్టీ 578 పాయింట్లు లాభపడి 11,382 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. ఈ స్థాయిలో సెన్సెక్స్‌, నిఫ్టీలు లాభపడటం గత పదేళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం. రూపాయి బలపడటంతో ఒక్క ఐటీ రంగానికి చెందిన షేర్లు తప్ప మిగిలిన అన్నిరంగాలకు చెందిన షేర్లకు విపరీతమైన కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ప్రైవేట్‌ బ్యాంక్‌, అటోరంగ షేర్లు అత్యధికంగా ర్యాలీ చేస్తున్నాయి. 
మధ్యాహ్నం గం.3:00లకు సెన్సెక్స్‌ 1942.62 పాయింట్లు లాభంతో 38,036.09 వద్ద, నిఫ్టీ 563.25 పాయింట్లు పెరిగి 11,268.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీ కారణంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2,260.20 పాయింట్లు (8.50శాతం) పెరిగి 29,000  పైన 29,017.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

భలే మంచి రోజు...కార్పొరేట్‌ పన్ను తగ్గింపుపై వ్యాఖ్యలు

Friday 20th September 2019

 కేంద్రప్రభుత్వం, దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి (అన్ని రకాల సర్‌చార్జీ, సెస్‌ కలిపి) 25.17 శాతానికి తగ్గించి మార్కెట్‌ వర్గాలను శుక్రవారం ఆశ్చర్యపరిచింది. ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు పొందే దేశీయ కంపెనీలు 25.17 శాతం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను, ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు పొందని దేశీయ కంపెనీలు 22 శాతం కార్పోరేట్‌ ట్యాక్స్‌ను చెల్లించే విధంగా తాజాగా చర్యలను ప్రకటించింది. 22 శాతం స్లాబ్‌ను ఎంచుకున్న దేశీయ కంపెనీలు

బీపీసీఎల్‌ జోరు..లాభాల్లో ఇంధన షేర్లు

Friday 20th September 2019

కేంద్ర ఆర్థిక మంత్రి, అనూహ్యంగా దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్యలను ప్రకటించడంతో దేశీయ మార్కెట్‌లు అమాంతం పెరిగాయి. ఇటువంటి పరిస్థితులలో బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియం కార్పోరేషన్‌)లోని ప్రభుత్వ వాటాను కూడా కేంద్ర ప్రభుత్వం విక్రయించనుందనే అంచనాలు మార్కెట్‌లో మొదలయ్యాయి. మొత్తంగా శుక్రవారం ట్రేడింగ్‌లో బీపీసీఎల్‌ షేరు​మధ్యాహ్నాం 2.14 సమయానికి 13.37 శాతం లాభపడి రూ. 429.65 వద్ద ట్రేడవుతోంది. దీంతో నిఫ్టీ ఎనర్జీ ఇండెక్స్‌ 4.70 శాతం

Most from this category