News


ఫ్లాట్‌గా ప్రారంభమైన మార్కెట్‌

Wednesday 4th September 2019
Markets_main1567569639.png-28172

క్రితం రోజు భారీ పతనం అనంతరం మార్కెట్‌ బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైంది. సెన్సెక్స్‌ గత ముగింపు (36,563)తో పోలిస్తే 8 పాయింట్ల స్వల్పలాభంతో 36,575.24 వద్ద, నిఫ్టీ నిన్నటి ముగింపు (10,798)తో పోలిస్తే 8 పాయింట్ల నష్టంతో 10,790.40 వద్ద ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు సూచీలను నష్టాల వైపు మళ్లించాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడలు కొనసాగుతుండటం, బలహీనమైన ఆర్థిక గణాంకాల నమోదు, రూపాయి బలహీనత తదితర అంశాలు దేశీయంగా సెంటిమెంట్‌ను బలహీనపరుస్తున్నాయి. యూఎస్‌ ఫ్యాక్టరీ యాక్టివిటీ గణాంకాలు మూడేళ్ల కనిష్టానికి పతనం కావడంతో ఆర్థిక మాంద్య భయాలు మరింత పెరిగాయి. మరోవైపు అమెరికా, చైనాలు గత వారాంతంలో ఒకదానిపై ఒకటి తాజాగా సుంకాలను విధించుకోవడంతో ఇప్పట్లో వాణిజ్య యుద్ధానికి తెరపడే అవకాశాలు లేవనే ఆందోళనలతో నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల్లో బాట పట్టాయి. ఉదయం గం.9:25ని.లకు సెన్సెక్స్‌ 60 పాయింట్ల నష్టంతో 36,502 వద్ద, నిఫ్టీ పోలిస్తే 21.85 పాయింట్ల నష్టంతో 10,776.05 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బ్యాంకింగ్‌, ఫార్మా, ఆర్థిక, రియల్టీ రంగ షేర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అటో, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, మీడియా రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది.
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టైటాన్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు 1.50శాతం నుంచి 4శాతం నష్టపోయాయి. ఇన్ఫోసిస్‌, హీరోమోటోకార్ప్‌, ఇన్ఫ్రాటెల్‌, గెయిల్‌, బ్రిటానియా షేర్లు అరశాతం నుంచి 1శాతం లాభపడ్డాయి.



You may be interested

పెరిగిన చమురు ధరలు

Wednesday 4th September 2019

  గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు తగ్గుతాయనే అంచనాల నేపథ్యంలో బుధవారం​ చమురు ధరలు పెరిగాయి. ఉదయం 9.39 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.15 శాతం పెరిగి బారెల్‌ 58.35 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.32 శాతం పెరిగి బారెల్‌ 54.11 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. అగష్టు 30తో ముగిసిన వారానికి గాను క్రూడ్‌ యుఎస్‌ నిల్వలు 30 లక్షల బారెల్‌లు, యుఎస్‌ గ్యాసోలిన్‌ నిల్వలు

భారీ పతనం తర్వాత కోలుకున్న రూపీ

Wednesday 4th September 2019

రూపీ డాలర్‌ మారకంలో బుధవారం ట్రేడింగ్‌లో 21 పైసలు బలపడి 72.18 వద్ద ప్రారంభమైంది. దేశియ ఈక్విటీ మార్కెట్లు భారీగా నష్టపోవడంతో పాటు, దేశ జీడీపీ ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోవడం, ఇతర ప్రధాన కరెన్సీలతో పోల్చుకుంటే డాలర్‌ బలపడడంతో గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 97 పైసలు బలహీనపడి 9 నెలల కనిష్ఠమైన 72.39 కి చేరుకుంది. ఆర్థిక సంవత్సరం 2020 జూన్‌ త్రైమాసికానికి సంబంధించి దేశ జీడీపీ

Most from this category