News


ప్రారంభంలో రికార్డుల హోరు

Monday 13th January 2020
Markets_main1578894488.png-30885

  • రెండోరోజూ ఆల్‌టైం హైని అందుకున్న నిఫ్టీ 
  • డిసెంబర్‌ 20న తర్వాత తొలిసారి ఆల్‌టైంకి సెన్సెక్స్‌

ఐటీ, మెటల్‌, బ్యాంక్‌ ఫార్మా షేర్ల ర్యాలీతో సోమవారం ఉదయం ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు కొత్త జీవితకాల గరిష్టస్థాయిలను అందుకున్నాయి. సెన్సెక్స్‌ 294 పాయింట్ల లాభంతో 41,893 వద్ద  నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 12,337.75 వద్ద ఆల్‌టైం హైకి అందుకున్నాయి. అమెరికా చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత మెరుగుపడవచ్చనే అంచనాలతో నేడు ఆసియా మార్కెట్లు 19నెలల గరిష్టాన్ని అందుకున్నాయి. అక్కడి నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న సూచీలు నేడు లాభంతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 192 పాయింట్ల లాభంతో 41,792 వద్ద, నిప్టీ 40 పాయింట్ల లాభంతో 12,297  వద్ద ట్రేడింగ్‌ను ట్రేడింగ్‌ ప్రారంభించాయి. శుక్రవారం మార్కెట్‌ ముగింపు అనంతరం ఫలితాలను వెల్లడించిన ఇన్ఫోసిస్‌ క్యూ3 గణాంకాలు మార్కెట్‌ అంచనాలను అందుకోవడంతో నేడు ఈ షేరు భారీ గ్యాప్‌తో మొదలవడంతో పాటు మిగతా హెవీ వెయిటేజ్‌ షేర్లైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు ర్యాలీ సూచీలను ఆల్‌టైం హైస్థాయిని అందుకునేందుకు తోడ్పాటునిచ్చాయని చెప్పవచ్చు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి బలపడటం కూడా సెంటిమెంట్‌ను బలపరిచింది. ఉదయం గం.10:30ని.లకు సెన్సెక్స్‌ 234 పాయింట్లు లాభంతో 41,834.02 వద్ద, నిఫ్టీ 64.15 పాయింట్లు పెరిగి 12,320.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఒక్క మీడియా రంగ షేర్లు తప్ప మిగితా అన్ని రంగాలకు చెందిన షేర్లు లాభాలతో ట్రేడ్‌ అవుతున్నాయి. నేడు మార్కెట్‌ ముగింపు అనంతం విడుదలయ్యే సీపీఐ(వినియోగదారుల ద్రవ్యోల్బణం)గణాంకాల కోసం ఎదురుచూస్తున్నాయి. వచ్చే ఆర్‌బీఐ పాలసీలో వడ్డీరేట్ల తగ్గింపు, పెంపు నిర్ణయంపై ఈ సీపీఐ గణాంకాలు కీలకం కానున్నాయి. 

గెయిట్‌, బ్రిటానియా, విప్రో, కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌ షేర్లు 1.25శాతం నుంచి 5శాతం లాభపడ్డాయి. యూపీఎల్‌, ఐషర్‌ మోటర్స్‌, టాటామోటర్స్‌, ఇన్ఫ్రాటెల్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నుంచి 6శాతం నష్టపోయాయి. You may be interested

ఇన్‌ఫ్రా షేర్లకు ఆర్బిట్రేషన్‌ ఆశలు..!

Monday 13th January 2020

క్లెయిముల పరిష్కారంపై అంచనాలు లాభాల్లో సద్భావ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్లస్‌లో జాతీయ రహదారుల అధీకృత సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తాజాగా ఆర్బిట్రేషన్‌ క్లెయిముల సెటిల్‌మెంటులవైపు దృష్టి సారిస్తున్నట్లు ప్రకటించింది. కోర్టు వెలుపల పరిష్కారానికి(ఔట్‌ ఆఫ్‌ కోర్టు సెటిల్‌మెంట్‌) వీలుగా చర్యలు చేపట్టనున్నట్లు తెలియజేసింది. తద్వారా రూ. 70,000 కోట్ల విలువైన క్లెయిముల పరిష్కార ప్రయత్రాలు ఊపందుకోనున్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే గత నెల(డిసెంబర్‌)లో రహదారులు, రవాణా శాఖల కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రూ.

ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌- ఫలితాల జోష్‌

Monday 13th January 2020

తొలుత డీమార్ట్‌ షేరు 3.3 శాతం ప్లస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించడంతో దేశీ రిటైల్‌ స్టోర్ల దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం(ఉదయం 10 ప్రాంతంలో) ఎన్‌ఎస్‌ఈలో ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌ షేరు 1.2 శాతం బలపడి రూ. 1898 వద్ద ట్రేడవుతోంది. తొలుత 3.3 శాతం జంప్‌చేసి గరిష్టంగా రూ. 1940ను అధిగమించింది.  ఫలితాల జోరు డీమార్ట్‌ బ్రాండుతో రిటైల్‌ స్టోర్లను నిర్వహిస్తున్న ఎవెన్యూ

Most from this category