STOCKS

News


కొత్త సంవత్‌లో బ్రోకరేజిల నిఫ్టీ, సెన్సెక్స్‌ అంచనాలు!

Saturday 26th October 2019
Markets_main1572062688.png-29148

- ఆశావహంగా కొత్త సంవత్‌..
- వడ్డీ రేట్ల కోత, ఉద్దీపనలు కీలకం 
- మరిన్ని సంస్కరణలకు అవకాశాలు
- ట్యాక్స్‌ రేటు తగ్గింపుతో కార్పొరేట్లకు ఊతం
- నిఫ్టీ టార్గెట్‌ 14,000, సెన్సెక్స్‌ 46,000
- బ్రోకరేజీల అంచనాలు

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌తో మొదలైన సంక్షోభం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలను కుదిపేస్తోంది. అంతర్జాతీయంగానేమో మందగమనం, వాణిజ్య యుద్ధ భయాలు రాజ్యమేలుతున్నాయి. అందుకే... మదుపరులకు సంవత్‌ 2075 పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. జీడీపీ అంచనాల తగ్గింపు, కంపెనీల ఆదాయాల డౌన్‌గ్రేడింగ్‌ వంటివి రికవరీని మరింత జాప్యం చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిఫ్టీ గతేడాది దీపావళి (2018 నవంబర్‌ 7) నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ 15 దాకా సుమారు 11 శాతం రాబడులిచ్చింది. కానీ మిడ్‌క్యాప్‌ 100 మాత్రం 6 శాతం, స్మాల్‌క్యాప్‌ 100 సూచీ 10 శాతం మేర క్షీణించాయి. 
మరి ఈ సంవత్సరమో...?
సంవత్‌ 2076లో ఆశావహ పరిస్థితులే కనిపిస్తున్నాయన్నది బ్రోకరేజీ సంస్థల మాట. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉదార ధోరణి కొనసాగించడం, ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోవడం దీనికి ప్రధాన కారణం. కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేటును 30 నుంచి 22 శాతానికి తగ్గించడం, తయారీ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చే చర్యలు ప్రకటించడం సెంటిమెంటును మెరుగుపరుస్తాయన్నది వారి అంచనా.  2020లో ప్రభుత్వ నిధుల సమీకరణకు డిజిన్వెస్ట్‌మెంట్‌ కీలకంగా మారనుంది. వీటన్నిటికీ తోడు ఈ ఏడాది అత్యంత మెరుగైన వర్షపాతం నమోదవటం... అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరలు స్థిర శ్రేణిలో తిరుగాడుతుండటం... కంపెనీల ఆదాయాలు మెరుగుపడొచ్చనే సంకేతాలను ఇస్తున్నాయి. ఇదిగో... ఈ ఆశలతోనే సంవత్‌ 2076 మొదలవుతోంది మరి!!
   

బ్రోకరేజీ సంస్థ  నిఫ్టీ సెన్సెక్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ 12,700 42,800
కోటక్‌ సెక్యూరిటీస్‌  13,000 43,500
ఐసీఐసీఐ డైరెక్ట్‌ 13,150  43,000
రెలిగేర్‌ 12,200  43,000
శామ్‌కో సెక్యూరిటీస్‌ 12,700 42,800

 You may be interested

కొత్త సంవత్‌లో గోల్డ్‌ రన్‌..

Saturday 26th October 2019

- రూ. 41,500కు చేరే అవకాశాలు అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక.. రాజకీయ ఆందోళనలు, బ్రెగ్జిట్‌పై తొలగని అనిశ్చితి... ఇవన్నీ 2019లో పసిడికి లాభించాయి. ఐఎంఎఫ్, వరల్డ్‌ బ్యాంక్‌ లాంటి సంస్థలు ప్రపంచ దేశాల వృద్ధి రేటు అంచనాలను కుదిస్తుండటంతో .. వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు బంగారం నిల్వలు మరింత పెంచుకున్నాయి. దేశీయంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం పుత్తడికి కలిసొచ్చింది. మొత్తం మీద గత

జియో లిస్టింగ్‌కు కసరత్తు షురూ

Saturday 26th October 2019

- డిజిటల్ కోసం అనుబంధ సంస్థ  - దాని రుణాలన్నీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు న్యూఢిల్లీ: టెలికం వ్యాపార సంస్థ రిలయన్స్ జియో (ఆర్‌జియో) లిస్టింగ్‌ దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా డిజిటల్ వ్యాపార విభాగాలన్నింటిని ఒకే గొడుగు కిందకి తీసుకొస్తూ ప్రత్యేక అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రిలయన్స్ జియో సహా డిజిటల్‌ వ్యాపార విభాగాలకు ఉన్న రుణభారాన్ని (సుమారు రూ. 1.73 లక్షల కోట్లు)

Most from this category