News


తొలిసారి 12300 దాటిన నిఫ్టీ

Friday 10th January 2020
Markets_main1578637692.png-30829

కలిసొచ్చిన ఐటీ, బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ 

మరో ఆల్‌టైమ్‌ హై రికార్డు సొంతం
కొత్త ఏడాదిలో నిఫ్టీ ఇండెక్స్‌ సరికొత్త జీవితకాల గరిష్టా‍న్ని నమోదు చేసింది. గతేడాది డిసెంబర్‌ 20న నమోదు చేసిన 12,293.90 స్థాయిని అధిగమించి 12,303 వద్ద కొత్త ఆల్‌టైం హైని నమోదు చేసింది. ఇరాన్‌, అమెరికా మధ్య గత వారం నెలకొన్న ఉద్రిక్త వాతావరణం సద్దుమనగడంతో నేటి ఉదయం నిఫ్టీ ఇండెక్స్‌  మునుపటి ముగింపుతో పోలిస్తే 12,216 పోలిస్తే 55 పాయింట్ల లాభంతో 12,271.00 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ మొదలైనప్పటి నుంచి ఐటీ, ఆటో, ఫార్మా, బ్యాంకింగ్ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ ర్యాలీ కొనసాగింది. ఈ క్రమంలో ఏకంగా 88 పాయింట్లను లాభాన్ని ఆర్జించి 12,303.75 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ఉదయం గం.11:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపుతో పోలిస్తే 86 పాయింట్ల లాభంతో 12,302.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి మరో ప్రధాన సూచీ సెన్సెక్స్‌ 319 పాయింట్ల లాభంతో 41,771.24 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ మొత్తంగా చూసినట్లైతే... మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు ఎక్కువగా లభిస్తుంది. 

నిఫ్టీ -50 ఇండెక్స్‌లో .... టాటా స్టీల్‌, ఎస్‌బీఐ, గెయిల్‌, వేదాంత, కోల్‌ ఇండియా షేర్లు 2శాతం నుంచి 3.50శాతం లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, టైటాన్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 4శాతం నష్టపోయాయి. 



You may be interested

పశ్చిమాసియా టెన్షన్లను తక్కువ చేసి చూస్తున్నారు!

Friday 10th January 2020

మార్కెట్లపై ఎకనమిస్టు నోరియల్‌ రౌబిని ప్రపంచ మార్కెట్లు యూఎస్‌, ఇరాన్‌ ఉద్రిక్తతలను తక్కువ చేసి చూస్తున్నాయని ప్రముఖ ఎకనమిస్టు నోరియల్‌ రౌబిని హెచ్చరించారు. ఇరుదేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధం రాకున్నా ప్రస్తుత టెన్షన్లు మరింత పెరిగేందుకు మాత్రం 50 శాతం ఛాన్సుందని అంచనా వేశారు. ఇదే జరిగితే క్రూడాయిల్‌ 80 డాలర్లను చేరవచ్చన్నారు. ఇది ఇండియాకు మంచిది కాదని చెప్పారు. ఇండియాకు క్రూడాయిల్‌ ధర 80 డాలర్లను చేరితే విత్త,

బ్యాంకుల్లో ఐసీఐసీఐ, ఎస్‌బీఐ బెటర్‌

Friday 10th January 2020

మోతీలాల్‌ ఓస్వాల్‌ సిఫార్సులు బడా బ్యాంకులు ఇకపై రికవరీ చెందుతాయని, ప్రాఫిట్స్‌లో బలమైన వృద్ధి నమోదు చేస్తాయని, దీంతో వీటి షేర్ల రీరేటింగ్‌ జరుగుతుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ వెల్లడించింది. బడా బ్యాంకుల్లో ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్‌బీఐలపై బుల్లిష్‌గా ఉన్నామని, మిడ్‌సైజ్‌ బ్యాంకుల్లో ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఫెడరల్‌ బ్యాంకులపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపింది. 1. ఐసీఐసీఐ బ్యాంకు: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 625. మేలైన వ్యాపార వ్యూహాలు, వైవిధ్యమైన ఉత్పత్తులు, ఏకీకృత

Most from this category