News


నిఫ్టీ 11,350 దాటకపోతే...200 డీఎంఏ వైపు ప్రయాణం

Monday 13th May 2019
Markets_main1557727490.png-25699

 అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలు బలంగా నెలకొన్న సమయంలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హఠాత్తుగా చైనాపై టారీఫ్‌ల పెంపునకు ఉత్తర్వులు జారీచేయడం, అందుకు ప్రతిచర్యలు చేపడతామంటూ చైనా హెచ్చరించడం వెంటవెంటనే జరిగిపోయాయి. దాంతో గత వారం ప్రపంచ మార్కెట్లు ఉక్కిరిబిక్కిరి అయిపోయాయి. కాకపోతే ఇతర ప్రధాన మార్కెట్లో చిన్న షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీలు వచ్చినప్పటికీ, ఇండియా సూచీలు మాత్రం అదేపనిగా వారమంతా పడిపోయాయి. ఇక్కడి లోక్‌సభ ఎన్నికల ఫలితాల పట్ల ఇన్వెస్టర్లకున్న టెన్షన్‌ ఇందుకు కారణం కావొచ్చు. వారం రోజుల క్రితం వరకూ సాంకేతికంగా బలంగా వున్న సూచీలు, ప్రస్తుతం బాగా బలహీనపడిపోయాయి. ఈ నేపథ్యంలో ఏదైనా రిలీఫ్‌ర్యాలీ వచ్చినా, వెంటనే చెల్లాచెదురయ్యే ప్రమాదం వుంటుంది.  ఇక  సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
మే 10తో ముగిసినవారంలో వరుసనష్టాల్ని చవిచూసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరిరోజున 37,370 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 1500 పాయింట్ల భారీనష్టంతో 37,463 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. మార్కెట్‌ ఓవర్‌సోల్డ్‌ కండీషన్‌లో వున్నందున, ఈ వారం ప్రారంభంలో షార్ట్‌ కవరింగ్‌ ర్యాలీ జరిగితే తొలుత 37,740 పాయింట్ల స్థాయి వద్ద సెన్సెక్స్‌కు అవరోధం కలగవచ్చు. ఈ స్థాయిపైన స్థిరపడితేనే తదుపరి ర్యాలీ కొనసాగి 37,930 పాయింట్ల స్థాయిని చేరే అవకాశం వుంటుంది. అటుపైన 38,250 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.  ఈ వారంలో తొలి నిరోధాన్ని చేధించలేకపోతే సెన్సెక్స్‌ మరింత బలహీనపడి 37,230 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 36,950 పాయింట్ల స్థాయికి పతనం కావొచ్చు. ఈ లోపున, ముఖ్యమైన మద్దతు ..200 రోజుల చలన సగటు రేఖ​ (200 డీఎంఏ) కదులుతున్న 36,680 పాయింట్ల స్థాయి. 

నిఫ్టీ 11,350 దాటకపోతే...200 డీఎంఏ వైపు ప్రయాణం
గత సోమవారం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమైన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,657  పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 11,251 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది.  చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 433 పాయింట్ల భారీ నష్టంతో 11,279 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం రిలీఫ్‌ ర్యాలీ జరిగితే నిఫ్టీని తొలుత 11,350 పాయింట్ల స్థాయి అవరోధం కల్పించవచ్చు. ఈ స్థాయిని దాటలేకపోతే..రానున్న కొద్ది రోజుల్లో 200 డీఎంఏ రేఖ కదులుతున్న 11,030 పాయింట్ల దిశగా నిఫ్టీ ప్రయాణించవచ్చు. ఈ వారం 11350 పాయింట్ల పైన స్థిరపడితే క్రమేపీ 11,410 పాయింట్ల స్థాయిని, అటుపై 11,485 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. 11,350 పాయింట్ల దిగువన 11,225 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,180 పాయింట్ల వద్దకు పడిపోవొచ్చు. ఈ స్థాయిని కూడా వదులుకుంటే 200 డీఎంఏను పరీక్షించవచ్చు.  You may be interested

మూడేళ్ల కోసం ఏ డెట్‌ ఫండ్‌ బెటరు?

Monday 13th May 2019

ప్ర:  దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసే ఉద్దేశంతో కొన్ని ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ల్లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌)లను ప్రారంభించాను. నా పోర్ట్‌ఫోలియోలో డెట్‌ సాధనాలేవీ లేవు. డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ నిమిత్తం అగ్రెసివ్‌ హైబ్రిడ్‌ ఫండ్‌లో  ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? -శేఖర్‌, విజయవాడ జ: ఇది ఒక విధంగా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. పైగా పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. అయితే ఇలా చేయకుండా పూర్తి స్థిరాదాయ

స్టాక్‌ సూచనలతో జర...జాగ్రత్త

Monday 13th May 2019

అడ్వైజర్ల ముసుగులో మోసాలు గత నెలలో ముగ్గురు మోసగాళ్లపై సెబీ చర్యలు వీటి బారిన పడకుండా తగిన జాగ్రత్తలు అవసరం రిజిస్టర్డ్‌ సంస్థలేనా, లైసెన్స్‌ ఉందా అన్నది పరిశీలించాలి గత ట్రాక్‌ రికార్డుల్లో మోసపూరిత వివరాలు ఉండొచ్చు మీ రిస్క్‌, రాబడుల ఆకాంక్షలకు అనుగుణంగా సూచనలు ఉండాలి నిజమైన అడ్వైజర్లు అన్ని రకాల ఉత్పత్తులను సూచిస్తారు పెట్టుబడుల విషయంలో సలహా సేవల పేరుతో ఇన్వెస్టర్లను పెద్ద ఎత్తున జరిగిన మోసం ఇటీవల వెలుగుచూసింది. ట్రోకా పేరుతో రూ.10 కోట్లకు పైగా

Most from this category