News


పతనం ఆగింది-లాభాల ముగింపు

Tuesday 25th September 2018
Markets_main1537870732.png-20562

నిఫ్టీ 11000 పాయింట్ల పైకి నిప్టీ
ముంబై:- కొద్దిరోజులుగా షేరు, బాండ్ల మార్కెట్లను అతలాకుతలం చేస్తున్న ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ను పరిరక్షిస్తామని, డిఫాల్ట్‌ కానివ్వమని, మరిన్ని పెట్టుబడులు పడతామంటూ ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీ చేసిన ప్రకటనతో మంగళవారం మార్కెట్‌ ఊరటపొందింది. ఐదు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. ఎల్‌ఐసీ ప్రకటన అనంతరం చివరి గంటలో వేల్యూ కొనుగోళ్లతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ తిరిగి 11,000 పాయింట్ల పైకి ఎగబాకింది. గత ఐదు రోజుల పతనంలో భారీగా నష్టపోయి, ప్రస్తుతం ఆకర్షణీయమైన ధరల్లో లభిస్తున్న ఫార్మా, ఫైనాన్స్ సర్వీసెస్‌, బ్యాంకింగ్‌, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లను ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఫలితంగా  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 347 పాయింట్లు పెరిగి 36,652 పాయింట్లకు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 11,039 పాయింట్ల వద్ద ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 25,330 వద్ద ముగిసింది. రియల్టీ షేర్లు తప్ప... మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేరు లాభాల్లో ముగిశాయి.  ఇంట్రాడేలో సెన్సెక్స్‌ సూచీ 642 పాయింట్ల రేంజ్‌లో కదలాడగా, నిఫ్టీ 198 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది.
కోల్‌ ఇండియా, పవర్‌గ్రిడ్‌, గెయిల్‌, ఇన్ఫ్రాటెల్‌, ఇండియన్‌బుల్ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 2నుంచి 6శాతం నష్టపోగా, హెచ్‌సీయుఎల్‌, లుపిన్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 3నుంచి 3.50శాతం లాభపడ్డాయి.



You may be interested

ఆగస్టులో ఆచితూచి కొనుగోళ్లు చేసిన ఎంఎఫ్‌లు

Tuesday 25th September 2018

దేశీయ ఫండ్‌ మేనేజర్లు ఆగస్టులో ఆచితూచి నాణ్యమైన స్టాకులను కొనుగోలు చేసినట్లు గణాంకాలు చూపుతున్నాయి. నిజానికి ఆగస్టు నెలలో కేవలం కొన్ని స్టాకులు తప్ప ఇతర స్టాకులన్నీ నేల చూపులు చూశాయి. అయితే కొన్ని మంచి కంపెనీల స్టాకుల్లో ఎంఎఫ్‌లు వాటాలు పెంచుకున్నాయి. - అదానీ పోర్ట్స్‌: గత జూలైతో పోలిస్తే ఆగస్టులో ఎంఎఫ్‌ల వాటా 15.4 శాతం మేర పెరిగింది.  - ఐటీసీ: ఎంఎఫ్‌లు వాటాను 11.9 శాతం మేర పెంచుకున్నాయి.  -

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ని రక్షిస్తాం: ఎల్‌ఐసీ

Tuesday 25th September 2018

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ కాకుండా ఆదుకుంటామని ఎల్ఐసీ హామీనిచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో వాటా పెంచుకోవడం సహా అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, మార్కెట్‌లో ఆందోళనలకు కారణమైన సమస్యను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని ఎల్‌ఐసీ భరోసానిచ్చింది. కాగా ఎల్‌ఐసీకి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌లో 25 శాతానికిపైగా వాటాలున్నాయి. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌న పతనం కానివ్వమని ఎల్‌ఐసీ చైర్మన్‌ వీకే శర్మ తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ ఆగస్ట్‌ నుంచి చెల్లింపుల్లో డిఫాల్ట్‌ అవుతూ వస్తోంది. దీంతో గ్రూప్‌ ఎండీ, సీఈవో రాజీనామా

Most from this category