News


రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Wednesday 28th August 2019
Markets_main1566974458.png-28071

నష్టాల మార్కెట్లోనూ రియల్టీ షేర్ల ర్యాలీ కొనసాగుతుంది. ఎన్‌ఎస్‌ఈలో ఈరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో 2.50శాతం ర్యాలీ చేసింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఒబేరాయ్‌ రియల్టీ ఇండెక్స్‌ 6శాతం ర్యాలీ చేసింది. కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ సోదాలను పూర్తి చేసింది. గత కొద్దిరోజులుగా ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తోందని, అధికారులు లేవనెత్తిన అంశాలన్నింటికి పూర్తి సమాచారం ఇవ్వడంతో పాటు సంపూర్ణ సహకారం అందిచినట్లు ఓబేరాయ్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. అలాగే రోజువారీ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ఐటీ శాఖ అనుమతినిచ్చిందని కంపెనీ తెలిపింది. ఫలితంగా కంపెనీ షేర్లు 6శాతం లాభపడ్డాయి. వాటితో పాటు బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 3.50శాతం, డీఎల్‌ఎఫ్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ షేర్లు 1శాతం పెరిగాయి. అలాగే శోభ ఇండస్ట్రీస్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు అరశాతం ర్యాలీచేశాయి. మరోవైపు ఇదే రంగంలోని సన్‌టెక్‌ షేర్లు 4శాతం, ఫోనిటెక్స్‌ షేర్లు 2శాతం, మహీంద్రా లైఫ్‌ షేర్లు 1శాతం క్షీణించాయి. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ కిత్రం ముగింపు(256.60)స్థాయితో పోలిస్తే 1.25శాతం పెరిగి 259.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

బ్యాంకుల మొండిబకాయిలు మరింత పెరుగుతాయా?

Wednesday 28th August 2019

తక్కువ రేటింగ్‌ ఉన్న కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీ(నాన్‌ బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ కంపెనీ)ల్లో ఎగవేతల వలన బ్యాంకింగ్‌ సెక్టార్‌లో మొండి బకాయిల భయాలు తిరిగి ఊపందుకున్నాయని అంతర్జాతీయ బ్రోకరేజి క్రెడిట్‌సూసీ పేర్కొంది. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల పరిష్కారం కోసం ఆర్‌బీఐ జూన్‌ 7 ప్రకటిచిన నిబంధనల కిందకు దాదాపు రూ. 2.4 లక్షల కోట్ల రుణాలు వస్తాయని తెలిపింది. ‘అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ రుణాలలో 70 శాతం రుణాలు తీవ్ర

పసిడిలో లాభాల స్వీకరణ

Wednesday 28th August 2019

ప్రపంచ ఆర్థిక మాంద్య భయాలతో కిత్రం ట్రేడింగ్‌లో ఆరేళ్ల గరిష్ట ధరపై ట్రేడైన పసిడి ధర బుధవారం స్వల్పంగా నష్టపోయింది. ఆరేళ్ల గరిష్టం వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం ఇందుకు కారణమైంది. చైనా-అమెరికాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, అమెరికా రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలతో పసిడి ధర ఇప్పటికీ ఆరేళ్ల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌

Most from this category