News


వెలుగులోకి రియల్టీ షేర్లు

Thursday 9th January 2020
Markets_main1578562396.png-30803

52వారాల గరిష్టానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 
రియల్టీ రంగ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో లాభాల బాటపట్టాయి. దీంతో ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 3శాతం లాభపడింది. అలాగే 52-వారాల గరిష్ట స్థాయిని అందుకుంది. గృహాలకు కొనుగోలు చేసే వారికి ఆర్థిక భరోసానిచ్చే రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారెంటీ(ఆర్‌బీబీజీ) పథకాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించారు. ఈ పథకం కొనుగోలుదారులకు, బిల్డర్లకు, బ్యాంకుకు ప్రయోజనం చేకూరుస్తుందని ఆశావహన అంచనాలతో రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తునట్లు మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు. మధ్యాహ్నం 3:00లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు 297.05తో పోలిస్తే 2.80శాతం లాభంతో 305.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో సన్‌టెక్‌ 5.50శాతం పెరిగింది. డీఎల్‌ఎప్‌ 5శాతం, ఐబీరియల్‌ఎస్టేట్‌ ఇండెక్స్‌ 3.50శాతం, ఓబేరాయ్‌ రియల్టీ, మహీంద్రాలైఫ్‌ షేర్లు 2శాతం పెరిగాయి. ఫోనెక్స్‌ లిమిటెడ్‌, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌, ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ షేర్లు 1శాతం లాభపడగా, బ్రిగ్రేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లు అరశాతం పెరిగింది. 



You may be interested

అగ్రి కెమ్‌, ఫెర్టిలైజర్‌ షేర్ల దూకుడు

Thursday 9th January 2020

జాబితాలో ఫ్యాక్ట్‌, జీఎస్‌ఎఫ్‌సీ రామా ఫాస్ఫేట్స్‌, మంగళూర్‌ కెమ్‌ ఏరీస్‌ ఆగ్రో, ఆర్‌సీఎఫ్‌, ఎన్‌ఎఫ్‌సీఎల్‌ 7-2 శాతం మధ్య హైజంప్‌ ఈ రబీ సీజన్‌(2019-20)లో పంటల విస్తీర్ణం పెరగడటం, ఇన్‌పుట్‌ వినియోగం పుంజుకోవడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో వ్యవసాయ రంగ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగింది. ఇన్వె‍స్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రధానంగా ఫెర్టిలైజర్‌, అగ్రి కెమికల్‌ కంపెనీల కౌంటర్లు లాభాల దూకుడు చూపుతున్నాయి. సకాల వర్షాలు, నీటి లభ్యత పెరగడం వంటి పరిస్థితుల కారణంగా

చిన్న స్టాకులు కొనే సమయం ఇదేనా?!

Thursday 9th January 2020

అవునంటున్న బ్రోకరేజ్‌లు కొత్త ఏడాది దలాల్‌ స్ట్రీట్‌లో ట్రెండ్‌ మారుతుందని ఎక్కువమంది అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. లార్జ్‌క్యాప్స్‌తో పోలిస్తే రెండేళ్లుగా మార్కెట్లో నీరసంగా ఉంటున్న చిన్న షేర్లు ఈ ఏడాది పుంజుకుంటాయంటున్నారు. ఇప్పటికే ఈ ట్రెండ్‌ యూఎస్‌, జపాన్‌ మార్కెట్లలో కనిపిస్తోందన్నారు. దేశీయ మిడ్‌క్యాప్స్‌ సైతం అంతర్జాతీయ మిడ్‌క్యాప్‌ సూచీలతో సమన్వయం కలిగి ఉంటాయని, అందువల్ల మన దగ్గర కూడా స్మాల్‌స్టాక్స్‌ పరుగులు తీసే సమయం వచ్చిందని చెబుతున్నారు. యూఎస్‌లో, యూరప్‌లో మిడ్‌క్యాప్‌

Most from this category