News


లాభాల్లో రియల్టీ షేర్లు

Friday 9th August 2019
Markets_main1565327562.png-27656

 ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించడంతో పాటు, దేశియ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ట్రేడవుతుండడంతో నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ ఉదయం 10.31 సమయానికి 1.16 శాతం లాభపడి 266.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో అత్యధికంగా ఇండియాబుల్స్‌ రియలెస్టేట్‌ 6.20 శాతం లాభపడగా, ప్రెస్టెజ్‌ ఇండస్ట్రీస్‌ 3.11 శాతం, సన్‌టెక్‌ 2.88 శాతం, మహీంద్రా లైఫ్‌ లిమిటడ్‌ 2.45 శాతం, డీఎల్‌ఎఫ్‌ 1.40 శాతం, ఒబేరాయ్‌ రియల్టీ 0.81 శాతం, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 0.79 శాతం, శోభా 0.22 శాతం లాభపడి ట్రేడవుతున్నాయి. కాగా ఇదే ఇండెక్స్‌లో ఫోనిక్స్‌ లిమిటెడ్‌ 2.25 శాతం, బ్రిగేడ్‌ ఇండస్ట్రీస్‌ 1.82 శాతం మాత్రం నష్టపోయి ట్రేడవుతున్నాయి.
 



You may be interested

భారత్‌లో ‘టిఫనీ’ బ్రాండ్‌..!

Friday 9th August 2019

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో భాగస్వామ్యం న్యూఢిల్లీ: ప్రముఖ అమెరికన్ జ్యుయలరీ సంస్థ టిఫనీ అండ్‌ కో భారత మార్కెట్లోకి ప్రవేశించనుంది. ముఖేష్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ భాగస్వామ్యంతో ఈ ఏడాదిలోనే తొలుత దేశ రాజధాని ఢిల్లీలో స్టోర్‌ను ఏర్పాటుచేయనుంది. వచ్చే ఏడాదిలో ముంబైలో రెండవ స్టోర్‌ ఏర్పాటుచేయాలని భావిస్తోంది. ఈ అంశానికి సంబంధించి రిలయన్స్ బ్రాండ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దర్శన్ మెహతా మాట్లాడుతూ.. ‘టిఫనీ ప్రఖ్యాత ఆభరణాలు, అత్యుత్తమ వజ్రాభరణాలను

కియాకు అన్ని విధాలా సహకారం

Friday 9th August 2019

కియాకు అన్ని విధాలా సహకారం వైజాగ్‌–చెన్నై–బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ ఏర్పాటు  ఆర్టీసీలో క్రమంగా అన్నీ విద్యుత్‌ బస్సులు సెల్టోస్‌ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సందేశం ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన సదుపాయాలతో పాటు రాయితీలు కల్పిస్తామని ఆయన హామీనిచ్చారు. దివంగత నేత, తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చొరవతో కియా కార్ల పరిశ్రమ ఏర్పాటు జరిగిందని పేర్కొన్నారు. అయితే, అనివార్య కారణాల

Most from this category