News


పాజిటివ్‌గా రియల్టీ..సన్‌టెక్‌ 4% అప్‌!

Wednesday 16th October 2019
Markets_main1571203023.png-28917

 బ్యాంకులు రుణ మేళాల ద్వారా పెద్ద మొత్తంలో రుణాలను అందిస్తుండడంతో పాటు, మరోదపా రేట్ల కోత ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ఫలితంగా గత కొన్ని సెషన్‌ల నుంచి దేశీయ రియల్టీ షేర్లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. వీటికి తోడు అంతర్జాతీయ పరిణామాలు కూడా సానుకూలంగా ఉండడంతో బుధవారం ఉదయం 10.39 సమయానికి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.46 శాతం లాభపడి 257.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో సన్‌టెక్‌ 4.35 శాతం, డీఎల్‌ఎఫ్‌ 2.43 శాతం, మహింద్రా లైఫ్‌ స్పేస్‌ డెవలపర్స్‌ 1.75 శాతం, గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ 1.61 శాతం, శోభ 1.51 శాతం, ఇండియాబుల్స్‌ రియల్టీ 0.90 శాతం, ప్రెస్టెజ్‌ ప్రాపర్టీస్‌ 0.67 శాతం, ఓబ్‌రాయ్‌ రియల్టీ 0.59 శాతం, బ్రిగేడ్‌ 0.45 శాతం లాభపడి ట్రేడవుతుండగా, ఫియెనిక్స్‌ మిల్స్‌ మాత్రం 0.16 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.
 You may be interested

ఈ నెల కనిష్టం వద్ద పసిడి ధర

Wednesday 16th October 2019

ఈక్విటీ మార్కెట్లు లాభాల బాట పట్టడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్లకు డిమాండ్‌ తగ్గుతుంది. ఆసియా మార్కెట్లో బుధవారం ఔన్స్‌ పసిడి ధర ఈ నెల(అక్టోబర్‌) కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందానికి సంబంధించి తొలి దశ ఒప్పందానికి చైనా అంగీకరించడంతో ఆసియా మార్కెట్లు, బ్రెగ్జిట్‌ సంబంధిత ఒప్పందం ఈ వారంలోనే కుదరగలదన్న వార్తలతో యూరప్‌ మార్కెట్లు, కార్పొరేట్‌ దిగ్గజాలు క్యూ3(జులై-సెప్టెంబర్)లో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటనతో అమెరికా

స్వల్ప లాభాల్లో క్రూడ్‌

Wednesday 16th October 2019

   బ్రెక్సిట్‌ ఒప్పందం సజావుగా సాగుతుందనే అంచనాలతోపాటు, ఒపెక్‌(చమురు ఎగుమతి, దిగుమతి దేశాలు), ఒపెక్‌ ప్లస్‌ దేశాలు చమురు ఉత్పత్తికి మరింత కోత విధించేందుకు ప్రయత్నాలు చేస్తుండడంతో చమురు ధరలు బుధవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా కదులుతున్నాయి. కానీ అంతర్జాతీయ ఆర్థిక మందగమనం వలన ఈ లాభాలు పరిమితంగానే ఉండనున్నాయి. ఉదయం 9.47 సమయానికి బ్రెంట్‌ క్రూడ్‌ 0.29 శాతం లాభపడి బారెల్‌ 58.91 డాలర్ల వద్ద, డబ్యూటీఐ క్రూడ్‌ 0.25

Most from this category