News


బడ్జెట్‌ స్ట్రాటజీ–నిఫ్టీ పుట్‌ రేషియో స్ప్రెడ్‌

Tuesday 29th January 2019
Markets_main1548747313.png-23872

బడ్జెట్‌ సమయంలో ఇన్వెస్టర్లు వారి పోర్ట్‌ఫోలియోల్ని హెడ్జ్‌ చేసుకునేందుకు, మార్కెట్‌ క్షీణిస్తే ట్రేడర్లు లాభాలు సంపాదించేందుకు నిఫ్టీ పుట్‌ రేషియో స్ప్రెడ్‌ స్ట్రాటజీ అవలంబించవచ్చునని టెక్నికల్‌ అనలిస్టులు సూచిస్తున్నారు. బడ్జెట్లో ద్రవ్యలోటు పెరగవచ్చని, వివిధ కారణాలతో బాండ్‌ ఈల్డ్స్‌ ఎగియవచ్చన్న అంచనాలు వున్న నేపథ్యంలో ఈ వ్యూహం ఫలితాల్ని ఇవ్వవచ్చని వారు సూచిస్తున్నారు. బడ్జెట్‌ సమర్పించబోయే ఫిబ్రవరి 1న ఎటువంటి ప్రతికూల ప్రతిపాదనలున్నా  నిఫ్టీ 10,100 పాయింట్లలోపునకు తగ్గబోదన్న అంచనాలతో  ఈ వ్యూహాన్ని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ రాజేష్‌ పాలివియా, క్రాస్‌సీస్‌ క్యాపిటల్‌ ఎండీ రాజేష్‌ బహతిలు సూచించారు. 
వ్యూహం ఏమిటి?
ఈ స్ట్రాటజీ కింద ఫిబ్రవరి నెల 10,500 స్ట్రయిక్‌ పుట్‌ను ఒకదానికి కొని, రూ. 10,100 స్ట్రయిక్‌ పుట్స్‌ రెండింటిని విక్రయించాలి. ఈ రెండు ప్రస్తుతానికి డీప్‌ అవుట్‌ఆఫ్‌ మనీ పుట్స్‌. బడ్జెట్‌ సమర్పించే ముందు..ఆ సమయంలో మార్కెట్‌ తీవ్ర ఒడుదుడుకులకు లోనవుతుందన్న అంచనాల ఆధారంగా ఈ స్ట్రాటజీని సిఫార్సుచేస్తున్నట్లు అనలిస్టులు తెలిపారు. ప్రస్తుతం 10500 ఫిబ్రవరి పుట్‌ ధర రూ. 139కాగా, రూ. 10,100పుట్‌ ధర రూ.56. రూ. 10500 పుట్‌ను ఒకదానిని కొని,చ 10,100 పుట్స్‌ను రెండింటిని రూ. 112కు విక్రయించడం ద్వారా 10,500 పుట్‌ను కొనేందుకు రూ. 27 ఖర్చుచేసినట్లవుతుంది. అంటే మార్కెట్‌ పెరిగితే వచ్చే నష్టం రూ. 27 అన్న మాట. నిఫ్టీ 10,473 పాయింట్ల దిగువకు తగ్గితే, ఈ స్ట్రాటజీ ద్వారా లాభం రావడం మొదలవుతుంది. బడ్జెట్‌ తరువాత నిఫ్టీ 10,100 పాయింట్ల స్థాయికి తగ్గినట్లయితే గరిష్టంగా రూ. 373 లాభం వస్తుంది. ఈ స్థాయిలోపునకు సైతం పతనం కొనసాగితే లాభాలు తగ్గుతూ 9727 స్థాయికి పడిపోతే లాభం జీరో అవుతుంది. ఈ లోపున నష్టం అపరిమితం. బడ్జెట్‌ తరువాత 10,000 పాయింట్ల వద్దకు నిఫ్టీ పడిపోయినట్లయితే 10,500 పుట్‌ రూ. 500కు, 10,100 పాయింట్ల పుట్స్‌ రెండూ కలిసి రూ. 200కు చేరడం ద్వారా లాభం రూ. 300కు పరిమితం అవుతుంది. అలా 10,100 పాయింట్ల దిగువన ప్రతీ పాయింట్‌ తగ్గుదలకూ లాభం తగ్గిపోతూ 9,727 పాయింట్లకు చేరితే అది జీరో అవుతుంది. ఈ స్థాయి వరకూ మార్కెట్‌ పడిపోయే అవకాశాలు తక్కువ కనుక, ఈ పుట్‌ రేషియో స్ప్రెడ్‌ స్ట్రాటజీని అమలు చేయవచ్చని అనిలిస్టులు సూచిస్తున్నారు. 



You may be interested

10,600 దిగువకు నిఫ్టీ

Tuesday 29th January 2019

మంగళవారం మధ్యాహ్న సెషన్‌ వరకూ స్వల్పలాభనష్టాల మధ్య ఊగిసలాడిన భారత్‌ మార్కెట్‌ మధ్యాహ్నం 1 గంటల సమయంలో తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యింది. దీంతో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచి 10,600 పాయింట్ల దిగువకు 10,590 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. క్రితం ముగింపుతో పోలిస్తే 70 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. అలాగే బీఎస​ఈ సెన్సెక్స్‌ 270 పాయింట్లకుపైగా క్షీణించి 35,380 పాయింట్ల స్థాయికి తగ్గింది. హువాయ్‌ సీఈఓపై అమెరికాలో ఛార్జ్‌షీట్‌ దాఖలు

పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2శాతం అప్‌

Tuesday 29th January 2019

6.50శాతం ర్యాలీ చేసిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గత రెండు ట్రేడింగ్‌లో నష్టాల్లో ముగిసిన ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు లాభాల బాట పట్టింది. ఇంట్రాడేలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల ర్యాలీ కారణంగా  ఎన్‌ఎస్‌ఈలోని అన్ని రంగాల సూచీకెల్లా పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ అత్యధికంగా 2.50శాతం పెరిగింది. ఉదయం గం.12:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(2,903.55)తో పోలిస్తే 2శాతం లాభంతో 2,962.10 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

Most from this category