నిఫ్టీ పుల్‌బ్యాక్ ర్యాలీ.. అయినా పరిమితమే..
By Sakshi

నిఫ్టీ గురువారం పెరిగినా కానీ, పుల్‌బ్యాక్ పరిమితమేనంటున్నారు ప్రముఖ నిపుణులు, జెమ్‌స్టోన్ ఈక్విటీ రీసెర్చ్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్ టెక్నికల్ అనలిస్ట్ మిలాన్ వైష్ణవ్. మార్కెట్లపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది.. ‘‘బుధవారం సెషన్ స్తబ్దుగా ఉంది. నిఫ్టీ రెండు రోజుల నష్టం తర్వాత 23.05 పాయింట్ల లాభంతో, కీలకమైన మద్దతు స్థాయి పైన నిలిచింది. గురువారం వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. కనుక నిఫ్టీ కీలకమైన మద్దతు స్థాయి 10,780-10,800ని కొనసాగిస్తుందని ఎక్కువ శాతం అంచనా. రాత్రికిరాత్రి ఎటువంటి పెద్ద పరిణామాలు లేకపోతే, గురువారం సానుకూలంగా మార్కెట్లు ప్రారంభం కావచ్చు. ప్రస్తుత స్థాయి నుంచి కొంత రికవరీ అవొచ్చు. 10,800 పుట్ అధిక వ్యాల్యూమ్స్తోపాటు ఓపెన్ ఇంట్రెస్ట్ అధికంగా నమోదవడం అన్నది ఈ స్థాయి కీలక మద్దతుగా పనిచేస్తుందని తెలుస్తోంది. అలాగే, 10,885, 10,910 స్థాయిలు నిరోధాలుగా వ్యవహరిస్తాయి. 10,780, 10,710 వద్ద మద్దతు రావచ్చు. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ (ఆర్ఎస్ఐ) డైలీ చార్ట్‌లో 42.57 వద్ద తటస్థంగా ఉంది. డైలీ ఎంఏసీడీ బై మోడ్‌లోనే ఉంది. కొత్తగా ఎటువంటి క్యాండిల్స్ ఏర్పడలేదు. ప్యాటర్న్‌ను పరిశీలించిన మీదట రౌండింగ్ టాప్ ఫార్మేషన్ వద్ద నెక్‌లైన్‌ను నిఫ్టీ దిగితే వేగంగా సూచీ తగ్గొచ్చు. ఇది జరిగితే నిరోధ స్థాయి ఇంకా కిందకు వెళుతుంది. గురువారం సెషన్ కుదురుగా మొదలైనా, మార్కెట్ పట్ల మేం చాలా అప్రమత్త ధోరణినే ప్రకటిస్తున్నాం. నిఫ్టీ సాంకేతికంగా పైకి వచ్చేందుకు వీలుంది. కానీ, అదే విధంగా పై స్థాయిల్లో ఇండెక్స్ నిలదొక్కుకోవడం కష్టమే. ట్రేడర్లు చాలా అప్రమత్త ధోరణితో స్టాక్వారీగా వ్యూహాన్ని అనుసరించడం మంచిది’’ అని మిలాన్ వైష్ణవ్ వివరించారు.
You may be interested
పావు శాతం ఫెడ్ రేట్ల కోత
Thursday 19th September 2019వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పావు శాతం(25 బేసిస్ పాయింట్లు) మేర తగ్గించింది. ఫెడ్ ఫండ్స్ రేటును ఇప్పుడున్న 2-2.5% శ్రేణి నుంచి 1.75-2 శాతం శ్రేణికి తగ్గించింది. ఫెడ్ రేట్లను తగ్గించడం ఈ ఏడాది రెండో సారి. మరోపక్క జీడీపీ అంచనాలను 2.2 శాతానికి ఫెడ్ పెంచింది. ఈ ఏడాది మరోసారి, లేదా రెండు సార్లు రేట్ల కోత ఉండాలని ఫెడ్ అధికారుల్లో ఐదుగురు
పెరుగుతున్న మాంద్యం భయాలు.. మన పరిస్థితేంటి..?
Thursday 19th September 2019అంతర్జాతీయంగా మాంద్యం పట్ల భయాలు పెరుగుతున్నాయి. వర్ధమాన దేశాలతోపాటు, అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ విషయంలో ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, చైనా మధ్య తీవ్ర స్థాయిలో వాణిజ్య యుద్ధం నడుస్తుండడం, చమురు ధరల్లో అస్థిరతలు, మన దేశంపై ప్రభావం చూపించేవే. ఇప్పటికే మన దేశ ఆర్థిక వృద్ధి ఆరేళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. జూన్ క్వార్టర్లో 5 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. దీంతో మన ప్రభుత్వం