News


పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3.50శాతం డౌన్‌

Monday 13th May 2019
Markets_main1557732850.png-25708

స్వల్ప నష్టాల ట్రేడింగ్‌లో భాగంగా సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ నేడు 3.50 శాతం నష్టపోయింది. ఇప్పటివరకు క్యూ4 ఫలితాలను ప్రకటించిన పలు ప్రభుత్వరంగ బ్యాంకుల ఫలితాలు మార్కెట్‌ వర్గాల అంచనాలను అందుకోలేకపోవడంతో ఈ రంగ షేర్లలో అమ్మకాలు మొదలైనట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అలహాదాబాద్‌ బ్యాంక్‌ షేర్లు అత్యధికంగా 7శాతం నష్టపోయింది. యూనియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ షేర్లు 6శాతం, పీఎన్‌బీ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 5శాతం, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ షేర్లు 4శాతం నష్టపోయాయి. అలాగే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఓరియంటల్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌ 2శాతం, జమ్మూ&కాశ్మీర్‌ షేర్లు 1.50శాతం క్షీణించాయి. మరోవైపు ఎస్‌బీఐ బ్యాంకు షేర్లు మాత్రం అరశాతం లాభంతో ట్రేడ్‌ అవుతున్నాయి. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(3,022.50)తో పోలిస్తే 3.25శాతం నష్టంతో 2,925.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

నష్టాల బాటలో అటో షేర్లు

Monday 13th May 2019

మార్కెట్‌ పతనంలో భాగంగా అటోరంగ షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎన్‌ఈసీలో అటోరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 1శాతం క్షీణించింది. గత సంవత్సరపు చివరి త్రైమాసికంలో పలు వాహన కంపెనీల ప్రకటించిన ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో ఏప్రిల్‌లో వాహన విక్రయాలు క్షీణించనట్లు సియామ్‌, ఎఫ్‌ఏడీఏ సంస్థలు గణాంకాలను విడుదల చేయడంతో నేడు వాహన కంపెనీ షేర్లపై అమ్మకాల ఒత్తిడి నెలకొంది. క్యూ4

హెచ్‌డీఎఫ్‌సీ లాభం 27 శాతం అప్‌

Monday 13th May 2019

మార్చి త్రైమాసికానికి హెచ్‌డీఎఫ్‌సీ నికరలాభం 27 శాతం పెరిగి రూ. 2861.6 కోట్లకు చేరింది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 2256.68 కోట్ల లాభం నమోదు చేసింది. సమీక్షా కాలంలో కంపెనీ రెవెన్యూ రూ. 11586 కోట్లను చేరింది. కంపెనీ కొత్త అకౌంటింగ్‌ ప్రమాణాలకు మారినందున ఈ ఫలితాలను గత ఫలితాలతో పోల్చలేము. కంపెనీ స్థూల ఎన్‌పీఏలు 1.22 శాతం నుంచి 1.18 శాతానికి దిగివచ్చాయి. క్యు4లో కంపెనీ

Most from this category