News


ప్రభుత్వరంగ బ్యాంకు షేర్ల ర్యాలీ

Wednesday 3rd July 2019
Markets_main1562150757.png-26768

ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో నష్టాల బాట పట్టిన ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ రంగ(పీఎస్‌యూ)షేర్లు మిడ్‌సెషన్‌ సమయానికల్లా తిరిగి లాభాల్లోకి మళ్లాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌  నేడు 3,207.60ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కేవైసీ నిబంధలను ఉల్లఘించినందుకు ఆర్‌బీఐ 4 ప్రభుత్వరంగ బ్యాంకులపై రూ.1.75 కోట్ల జరిమానా విధించింది. వాటిలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, అలహదాబాద్‌ బ్యాంకులపై రూ.50లక్షలు, కార్పోరేషన్‌ బ్యాంకుపై రూ.25లక్షల చొప్పున జరిమానా విధించినట్లు సోమవారం ఆయా ఆయా బ్యాంకులు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చాయి. ఫలితంగా ట్రేడింగ్‌ ప్రారంభంలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఈ క్రమంలో ఇండెక్స్‌ 114 పాయింట్ల నష్టపోయి 3,186.00 స్థాయికి ఇంట్రాడే కనిష్టానికి తాకింది. అయితే, మిడ్‌సెషన్‌ సమయానికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 4.50శాతం, అలహాదాబాద్‌ బ్యాం‍క్‌ షేర్లు 4 శాతం, జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్ షేర్లు 3శాతం ర్యాలీ చేయడంతో ఇండెక్స్‌ ఉదయం కోల్పోయిన నష్టాలను పూడ్చుకోగలిగింది. మధ్యాహ్నం గం.3:00లకు ఇండెక్స్‌ గత ముగింపు(3,200.60)తో పోలిస్తే 1.25శాతం లాభపడి 3,241.45వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇక ఇదే సమయానికి సెన్సెక్స్‌ 19 పాయింట్లు పెరిగి 39,835.68 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు నష్టపోయి 11,904.60 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లకు రూ.74,000కోట్ల బెయిలవుట్‌

Wednesday 3rd July 2019

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన భారతీ నిగమ్‌ లిమిటెడ్‌(బీఎస్‌ఎన్‌ఎల్‌), మహానగర్‌ టెలిపోన్‌ నిగమ్‌(ఎమ్‌టీఎన్‌ఎల్‌)లకు రూ.74,000 కోట్ల బెయిఅవుట్‌ ప్యాకేజీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్కీమ్‌లో ఎక్సి‍ట్‌ ప్యాకేజితో పాటు అదనపు ఐదు శాతం పరిహారం, 4జీ స్పెక్ట్రమ్‌ నిబంధనలు, మూలధన వ్యయం మిళితమై ఉన్నాయి. ఆర్ధిక సంవత్సరం 2019 చివరి నాటికి అధిక రుణాలు కలిగిన ప్రభుత్వ రంగ సంస్థల్లో, రూ.13,804కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇండియా మొదటి స్థానంలో ఉంది. మూడవ స్థానంలో

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ 9.50శాతం అప్‌

Wednesday 3rd July 2019

కొత్త రుణాల జారీకి  రుణదాతలు ఆమోదం తెలపడంతో డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో సెషన్‌లో 9.50శాతం ర్యాలీ చేశాయి. నేడు ఈ కంపెనీ షేర్లు రూ.75.65ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గతేడాది సెప్టెంబర్‌లో తలెత్తిన ద్రవ్య సంక్షోభం నాటి నుంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ కొత్తగా ఎలాంటి రుణాలను జారీ చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో సోమవారం యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని 30 మంది రుణదాతల కన్సార్షియం సమావేశం నిర్వహించింది. కంపెనీ

Most from this category