STOCKS

News


లాభాల్లో పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌

Tuesday 27th August 2019
Markets_main1566888997.png-28048

ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు వరుసగా రెండోరోజూ ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70వేల కోట్ల నిధుల కేటాయిస్తున్నట్లు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటనతో ఈ రంగ షేర్లలో ర్యాలీ నెలకొంది. తాజా నిన్న ప్రభుత్వానికి రూ.1.76 లక్షల కోట్ల డివిడెండ్‌ను, అదనపు నిధులను బదిలీ చేయడానికి ఆర్‌బీఐ బోర్డు ఆమోదం వేయడం కూడా కలిసొచ్చింది. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.90వేల కోట్ల డివిడెండు వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, అంతకు మించి రూ.95, 414 కోట్లు లభిస్తుండటం విశేషం. ఈ సానుకూలాంశాల ప్రభావంతో నేడు పీఎస్‌యూ షేర్లకు భారీగా డిమాండ్‌ నెలకొంది. ఫలితంగా పీఎస్‌యూ ఇండెక్స్‌ 3.50శాతం ర్యాలీ చేసి 2575.70 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:00లకు ఇండెక్స్‌ కిత్రం ముగింపు(1111)తో పోలిస్తే 2.50శాతం లాభంతో 2,550 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అన్ని షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అత్యదికంగా ఓరియంటల్‌ బ్యాంక్‌ 8శాతం లాభపడింది. అలాగే ఇండియాబ్యాంక్‌ 5శాతం, అలహదాబాద్‌ బ్యాంక్‌ 4.50శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 3.50శాతం, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 3శాతం పెరిగాయి. సిండికేట్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, పీఎన్‌బీ షేర్లు 2.50శాతం ర్యాలీ చేశాయి. అలాగే జమ్మూ&కాశ్మీర్‌ బ్యాంక్‌, 1.50శాతం, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 1శాతం పెరిగాయి. 



You may be interested

టాటా మోటర్స్‌ ర్యాలీ

Tuesday 27th August 2019

అటోరంగ షేర్లు ర్యాలీలో టాటామోటర్స్‌ షేర్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు రూ.112.30ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. దేశీయంగా చిన్నాభిన్నమైన అటో పరిశ్రమను గాడిన పెట్టేందుకు శుక్రవారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ పలు ఉద్దీపనలు ప్రకటించారు. అందులో భాగంగా వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు వాయిదా వేయడం, ప్రభుత్వ విభాగాలు పెట్రోలు, డిజిల్‌ వాహనాలు కొనుగోలు చేయకుంగా ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడం లాంటి పలు ఉద్దీపన

సిప్‌తో రిస్కు తగ్గించుకోండి!

Tuesday 27th August 2019

చిన్న స్టాకుల్లో పెట్టుబడులపై నిపుణుల సలహాలు గత కరెక‌్షన్‌లో భారీగా పతనమైన చిన్నస్టాకుల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే  ఇన్వెస్టర్లు సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) మార్గాన్ని ఎంచుకోవాలని వెల్త్‌ మేనేజర్లు సూచిస్తున్నారు. గతేడాది జనవరి నుంచి చాలా చిన్న స్టాకులు దాదాపు 70 శాతం మేర పతనమయ్యాయి. దీంతో వీటి వాల్యూషన్లు బాగా చౌకగా మారాయి. అయితే ఎర్నింగ్స్‌ ఆందోళనల నేపథ్యంలో వీటిలో వెనువెంటనే భారీ రికవరీ ఉండకపోవచ్చని నిపుణుల అంచనా. అందువల్ల ఇలాంటి

Most from this category