News


ఏడాది కనిష్టానికి నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌

Tuesday 20th August 2019
Markets_main1566294276.png-27898

ఒడిదుడుకుల మార్కెట్‌లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు మంగళవారం భారీగా పతమమయ్యాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3శాతం మేర నష్టపోయి ఏడాది కనిష్ట స్థాయిని తాకింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 4శాతం క్షీణించగా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌ 3.50శాతం నష్టపోయాయి. ఓరియంటల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ బ్యాంక్‌ 3శాతం నష్టపోయాయి. అలాగే కెనరా బ్యాంక్‌ 2.50శాతం, అలహబాద్‌ బ్యాంక్‌ 2శాతం, సిండికేట్‌ బ్యాంక్‌ 1.50శాతం, సెంట్రల్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. మరోవైపు జమ్మూకాశ్మీర్‌ బ్యాంక్‌ 1శాతం లాభపడింది. ప్రభుత్వ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌ 2నెలల్లో 22శాతం మేర క్షీణించింది. 



You may be interested

స్వల్పకాలానికి హెచ్‌డీఎఫ్‌సీకి దూరం!

Tuesday 20th August 2019

కోటక్‌ సెక్యూరిటీస్‌ సూచన వీక్లీ చార్టుల్లో హెచ్‌డీఎఫ్‌సీ బేరిష్‌ ధోరణి చూపుతోందని కోటక్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ చెప్పారు. చార్టుల్లో హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌ ప్యాట్రన్‌ ఏర్పడిందని, దీనికితోడు కీలక మద్దతుకు దిగువన క్లోజయిందని చెప్పారు. గతంలో ఆర్‌ఐఎల్‌లో కనిపించిన ధోరణి ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీలో ఉందన్నారు. అందువల్ల స్వల్పకాలానికి ఈ షేరుకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. కొన్ని వారాలపాటు హెచ్‌డీఎఫ్‌సీపై బుల్లిష్‌ కాల్స్‌ను పట్టించుకోవద్దన్నారు. మరో దిగ్గజం

ప్యాకేజీ అంచనాలు...ఆటో షేర్ల పరుగులు

Tuesday 20th August 2019

ప్రభుత్వం రంగాల వారిగా ప్యాకేజిని ప్రకటించే అవకాశం ఉండడంతో మార్కెట్‌  మంగళవారం నష్టాల్లో ట్రేడవుతోంది. కాగా ఆటో సెక్టార్‌ మందగమనాన్ని అపడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే అంచనాల నేపథ్యంలో ఆటో ఇండెక్స్‌ పాజిటివ్‌గా ట్రేడవుతోంది. మధ్యాహ్నాం 2.21 సమయానికి 1.35 శాతం లాభపడి 7,053.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన  ఎంఆర్‌ఎఫ్‌ 0.11 శాతం లాభపడి రూ. 57,502.00 వద్ద ట్రేడవుతుండగా, మారుతి సుజుకీ 3.11

Most from this category