News


పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.50శాతం డౌన్‌

Wednesday 29th May 2019
Markets_main1559119406.png-25981

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నష్టాల మార్కెట్లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీ అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌  5శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ 3శాతం, అలహబాద్‌ 2.50శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ షేర్లు 2శాతం పతనమయ్యాయి.  ఓరియండెల్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం క్షీణించగా, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌ బ్యాంక్‌, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌  షేర్లు 1శాతం నుంచి అరశాతం నష్టపోయాయి. మరోవైపు ఇండియన్‌ బ్యాంక్అ‌రశాతం లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం గం.1:45ని.లకు ఇండెక్స్‌ గతముగింపు (3,370.55)తో పోలిస్తే 2.50శాతం నష్టపోయి 3,284.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి  ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 145 పాయింట్లు నష్టపోయి 39,603 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లను కోల్పోయి 11,886 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 
 



You may be interested

ట్రేడ్‌ వార్‌ ఎఫెక్ట్‌ : నష్టాల్లో మెటల్‌ షేర్లు

Wednesday 29th May 2019

మెటల్‌ షేర్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌లో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4.50శాతం నష్టపోయింది. అమెరికా- చైనాల మధ్య రోజురోజుకూ ముదురుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనల రేకిత్తిన నేపథ్యంలో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ను తగ్గించనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెయిల్‌ 3.50శాతం, జిందాల్‌ స్టీల్‌, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌,

ఎదురీదుతున్న ఐటీ షేర్లు

Wednesday 29th May 2019

నష్టాల మార్కెట్లో బుధవారం ఐటీ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత ఇందుకు నేపథ్యం. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ నేడు 15,773.30 వద్ద ప్రారంభమైంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి 29పైసలు బలహీనపడింది. డాలర్ల రూపంలో ఆదాయాలను ఆర్జించే ఐటీ కంపెనీలకు ఈ అంశం కలిసొస్తుందన్న ఐటీ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. ఫలితంగా ఐటీ ఇండెక్స్‌

Most from this category