పీఎస్‌యూ బ్యాంక్ షేర్ల పతనం
By Sakshi

బడ్జెట్ శుక్రవారం వెలువడిన తర్వాత నుంచి మార్కెట్లు భారీ పతనాలకు గురవుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం(జులై 8) ట్రేడింగ్‌లో పీఎస్‌యూ బ్యాంక్ నిఫ్టీ భారీగా నష్టపోయింది. 3,263.80 పాయింట్ల వద్ద ప్రారంభమైన ఈ సూచీ 155.05 పాయింట్లు లేదా 4.69 శాతం నష్టపోయి 3,148.30 వద్ద ట్రేడవుతోంది. ఇందులో పీఎన్బీ 10.21 శాతం, యూనియన్ బ్యాంక్ 6.71 శాతం, బ్యాంక్ ఇండియా 6.06 శాతం, కెనరా బ్యాంక్ 5.55 శాతం నష్టపోయాయి. వీటితో పాటు సిండికేట్ బ్యాంక్ 4.05 శాతం, అలహాబాద్ బ్యాంక్ 3.60 శాతం, సెంట్రల్ బ్యాంక్ 3.13 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 3.03 శాతం, ఎస్బీఐ 2.86 శాతం, ఓరియంటల్ బ్యాంక్ 2.30 శాతం, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 2.26 శాతం, ఇండియన్ బ్యాంక్ 2.04 శాతం చొప్పున నష్టపోయాయి.
You may be interested
లార్జ్‌క్యాప్‌లో సుదీర్ఘ అనుభవం
Monday 8th July 2019హెచ్డీఎఫ్సీ టాప్ 100... ఈక్విటీ మార్కెట్లలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రాబడులు కూడా అలానే ఉంటాయి మరి. అయితే, ఈక్విటీల్లో రిస్క్ కొంత తక్కువ ఉండాలనుకునే వారికి లార్జ్‌క్యాప్ విభాగం అనుకూలం. లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారి ముందున్న ఎంపికల్లో హెచ్డీఎఫ్సీ టాప్ 100 మ్యూచువల్ ఫండ్ పథకం కూడా ఒకటి. ఈ పథకానికి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. మార్కెట్ పతనాలను ఎన్నింటినో చూసి ఉన్నది. రాబడుల విషయంలో మంచి ట్రాక్
నివాస గృహ మార్కెట్‌కు పూర్వవైభవం!
Monday 8th July 2019భారతీయ రియల్ ఎస్టేట్ మార్కెట్లో గత కొన్నేళ్లో వృద్ధి నెమ్మదించింది. రెరా, జీఎస్టీ వంటివి రియల్ ఎస్టేట్ రంగం కొలుకోవడానికి కీలకమైన అంశాలు. రెరా, జీఎస్టీ అమలు చేసిన తర్వాత దేశంలోని 8 ప్రధాన పట్టణాల్లో 2018లో గృహాల అమ్మకాల్లో 6 శాతం వృద్ధి అంచనాలు వెలువడ్డాయి. 2017తో పోలిస్తే 2018లో 75 శాతం కొత్త ప్రాజెక్టుల్లో అమ్మకాలు జరగ్గా, అమ్ముడు కాని ప్రాజెక్టులు 11 శాతానికి తగ్గాయి. ప్రస్తుతం,