News


అమ్మకాల ఒత్తిడిలో ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు

Monday 17th February 2020
news_main1581920062.png-31852

లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్న మార్కెట్లో సోమవారం ఉదయం ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లు నష్టాలను ఎదుర్కోంటున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ ఉదయం ట్రేడింగ్‌లో 2.20శాతం నష్టాన్ని చవిచూశాయి. నేడు ఈ ఇండెక్స్‌ 2,207.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. టెలికాం కంపెనీలు చెల్లించాల్సిన మొండిబకాయిలు మరింత పెరగవచ్చని భయాలతో ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్లను విక్రస్తున్నారు. టెలికాం కంపెనీలకు ప్రభుత్వరంగ బ్యాంకులకు ఎక్స్‌పోజర్‌ ఉన్న నేపథ్యంలో ఈ రంగానికి చెందిన షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని లోనవుతున్నాయి. ఫలితంగా ఇండెక్స్‌ 2.20శాతం పతనమైన 2,162.15 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేసింది. ఉదయం గం.11:15ని.లకు ఇండెక్స్‌ మునుపటి ముగింపు (2,211.20)తో పోలిస్తే 2.14శాతం నష్టంతో 2,163.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఈ ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన జమ్మూ కాశ్మీర్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 4.50శాతం నష్టాన్ని చవిచూసింది. పీఎన్‌బీ 3శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా 2.50శాతం, ఇండియన్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌ షేర్లు 2శాతం, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, యూనియన్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ షేర్లు 1.50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఐఓబీ, మహారాష్ట్ర బ్యాంక్‌ 1శాతం పతనమగా, సెంట్రల్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, పీఎస్‌బీ బ్యాంక్‌ షేర్లు అరశాతం వరకు క్షీణించాయి. 



You may be interested

స్వల్ప కాలానికి 12 బుల్లిష్‌ స్టాక్స్‌!

Monday 17th February 2020

జాబితాలో బయోకాన్‌, లుపిన్‌ టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌, సింఫనీ నవీన్‌ ఫ్లోరిన్‌, సుప్రజిత్‌, ఇండొకొ వివిధ విశ్లేషకుల సిఫారసులు కరోనా వైరస్‌, ఆర్థిక మందగమనం, ఏజీఆర్‌ బకాయిలపై సుప్రీం కోర్టు ఆదేశాలు తదితర అంశాల మధ్య స్టాక్‌ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల వెలువడిన ఆర్థిక గణాంకాలు నిరాశను కలిగించినట్లు తెలియజేశారు. ఐఐపీ నీరసించడం, రిటైల్‌ ద్రవ్యోల్బణం జోరందుకోవడం తదితరాల నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌ తదుపరి పాలసీ సమీక్షలో రెపో రేటులో కోతపెట్టే వీలున్నట్లు

మేం కట్టాల్సింది చాలా తక్కువ..టెల్కోల కొత్త లెక్క

Monday 17th February 2020

ఏజీఆర్‌పై వాదన టెలికం శాఖ డిమాండ్‌ చేస్తున్న దానికన్నా ఏజీఆర్‌ బకాయిలు తక్కువేనని తమ మదింపులో తేలిందని వొడాఫోన్‌ ఇండియా, ఎయిర్‌టెల్‌ తెలిపాయి. దీంతో ఏజీఆర్‌ బకాయిలపై మరో వివాదానికి తెరలేచినట్లవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డీఓటి లెక్క చెబుతున్నట్లు రూ. 35500 కోట్ల ఏజీఆర్‌ బకాయి ఉండదని, తమ గణనలో రూ. 15- 18 వేట కోట్లు మాత్రమే ఉంటందని ఎయిర్‌టెల్‌ పేర్కొనగా, వొడాఐడియా సైతం రూ. 53వేల బకాయి ఉండమని,

Most from this category