News


11,800పైన స్థిరీకరణకు అవకాశం..

Sunday 8th December 2019
Markets_main1575829060.png-30114

ఈక్విటీ మార్కెట్లు నూతన గరిష్ట స్థాయిల వద్ద నిరోధాన్ని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా 12,000 పై స్థాయిలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదురవుతోంది. 12,103 నిరోధాన్ని అధిగమించి పై స్థాయికి వెళితే తప్ప ర్యాలీకి అవకాశం లేదంటున్నారు జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు మిలాన్‌ వైష్ణవ్‌. రానున్న రోజుల్లో మార్కెట్లపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది.

 

‘‘ఈక్విటీ మార్కెట్లు డబుల్‌ టాప్‌ నిరోధం 12,103ను అధిగమించే ప్రయత్నంలో మరోసారి విఫలమయ్యాయి. దీంతో డబుల్‌టాప్‌ నిరోధాన్ని మరోసారి ధ్రువీకరించింది. 12,103-12,160 శ్రేణి గణనీయమైన నిరోధంగా వ్యవహరించనుంది. తదుపరి అప్‌మూవ్‌కు నిఫ్టీ ఈ నిరోధాన్ని బలంగా అధిగమించాల్సి ఉంటుంది. అప్పటి వరకు మార్కెట్లలో కన్సాలిడేషన్‌ కొనసాగుతుంది. అధిక స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడికి అవకాశం ఉంది. సోమవారం మార్కెట్లు అంతర్జాతీయ సానుకూలతలతో పాజిటివ్‌గా ప్రారంభం కావచ్చు. అయితే, 11,980-12,065 నిరోధంగా పనిచేస్తాయి. అదే సమయంలో మద్దతు స్థాయిలు 11,875-11,815. 

 

డైలీ చార్ట్‌లో ఆర్‌ఎస్‌ఐ 50.48 వద్ద ఉంది. ఇది తాజా 14 పీరియడ్‌ కనిష్ట స్థాయి. ఇది బేరిష్‌ సంకేతం. డైలీ ఎంఏసీడీ కూడా బేరిష్‌గా సిగ్నల్‌ లైన్‌కు దిగువనే ట్రేడ్‌ అవుతోంది. నిఫ్టీ మరోసారి డబుల్‌ టాప్‌ నిరోధాన్ని అధిగమించే ‍ప్రయత్నంలో విఫలమైనట్టు ప్యాటర్న్‌ తెలియజేస్తోంది. దీంతో నిఫ్టీకి 12,103-12,160 జోన్‌ బలమైన నిరోధంగా ఉంటుంది. డబుల్‌ టాప్‌ నిరోధం నుంచి నిఫ్టీ పడిపోవడంతోపాటు, 20 డీఎంఏ(11,979)కు దిగువకు చేరింది. దీంతో మార్కెట్లు తిరిగి ర్యాలీకి ప్రయత్నిస్తే ఇది మొదటి నిరోధంగా వ్యవహరిస్తుంది. నిఫ్టీ 20డీఎంఏకు దిగువకు వచ్చినందున 11,800 వరకు  దిద్దుబాటుకు అవకాశాలున్నాయి. అయితే, నిఫ్టీ 11,800కు పైన ఉన్నంత కాలం కన్సాలిడేషన్‌ కొనసాగుతుంది’’ అని మిలాన్‌ వైష్ణవ్‌ తెలియజేశారు.



You may be interested

అంతర్జాతీయ అంశాలే దిక్సూచి..!

Monday 9th December 2019

అమెరికా–చైనాల వాణిజ్య ఒప్పందంపై పెరిగిన ఆశావాదం మంగళ, బుధవారాల్లో అమెరికా ఎఫ్‌ఓఎంసీ సమావేశం గురువారం యూకేలో సాధారణ ఎన్నికలు ఐఐసీ, ద్రవ్యోల్బణం డేటా ఈవారంలోనే.. న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కేవలం 4.5 శాతం వృద్ధి రేటుకే పరిమితంకావడం, ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించడం వంటి ప్రతికూల అంశాల నేపథ్యంలో గతవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ఒక శాతం నష్టాలను నమోదుచేసింది. నిఫ్టీ 12,000 పాయింట్ల సైకలాజికల్‌ మార్కును కోల్పోయింది. ఇక

మీ రిస్క్‌ను అంచనా వేయడం ఎలా?

Sunday 8th December 2019

పెట్టుబడులను ఆరంభించే వారు ముందుగా వారి రిస్క్‌ సామర్థ్యంపై స్పష్టతకు రావడం అవసరం. తమ లక్ష్యాలు, వాటికున్న కాల వ్యవధి, ఆశించే రాబడులు ఇవన్నీ రిస్క్‌ సామర్థ్యాన్ని నిర్ణయిస్తాయి. ఈ కింద ప్రశ్నల ద్వారా ఇన్వెస్టర్లు తమ రిస్క్‌ను అంచనా వేసుకోవచ్చని ఎడెల్‌వీజ్‌ పర్సనల్‌ వెల్త్‌ అడ్వైజరీ విభాగం హెడ్‌ రాహుల్‌జైన్‌ తెలియజేశారు.    ఇన్వెస్ట్‌ చేయతగిన మిగులు ఎంత? మీ ఇన్వెస్ట్‌మెంట్‌ మిగులు మీ రిస్క్‌ సామర్థ్యాన్ని నిర్ణయిస్తుంది. మీ ఇన్వెస్ట్‌మెంట్‌ మిగులు

Most from this category