News


లాభాల్లో ఫార్మా షేర్లు

Tuesday 9th July 2019
Markets_main1562647777.png-26911

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఔషద పరిశ్రమ 11-13 శాతం వృద్ధి చెందగలదని సోమవారం ఇక్రా వెల్లడించిన నేపథ్యంలో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ మంగళవారం (జులై 9) లాభాల్లో ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌ 7,810.15 వద్ద ప్రారంభమవ్వగా 84.65 పాయింట్లు లేదా 1.09 శాతం లాభంతో 7,886.40 ట్రేడవుతోంది. సన్‌ ఫార్మా 2.10 శాతం, గ్లెన్‌ మార్క్‌ 1.90 శాతం, సిప్లా 1.45 శాతం, పెల్‌ 1.25 శాతం, కాడిల్హక్‌ 1.00 శాతం లాభపడ్డాయి. వీటితో పాటు దివిస్‌ ల్యాబ్‌ 0.83 శాతం, లూపిన్‌ 0.62 శాతం, డాక్టర్‌ రెడ్డీస్‌ 0.44 శాతం, అరబిందో ఫార్మా 0.42 శాతం మేర లాభపడి ట్రేడవుతున్నాయి. బైకాన్‌ షేరు మాత్రం 0.27 శాతం నష్టపోయి ఉంది. 



You may be interested

టైటాన్‌ 12 శాతం క్రాష్‌

Tuesday 9th July 2019

బంగారం ధరలు పెరగడంతో ఏప్రిల్‌-జూన్‌ క్వార్టర్‌లో డిమాండ్‌ తగ్గిందని టైటన్‌ ప్రకటించడంతో కంపెనీ షేరు విలువ మంగళవారం ట్రేడింగ్‌లో 12 శాతం నష్టపోయింది. స్థూల ఆర్థిక వ్యవస్థ మందగించడంతో పాటు బంగారం ధరలు పెరగడంతో ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో వినియోగంపై ప్రభావం చూపాయని సంస్థ  సోమవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాలలో పేర్కొంది.  దీంతో ఈ షేరు వరుసగా నాలుగోవ సెషన్‌లో కూడా నష్టపోయి ట్రేడవుతోంది. ‘ సంస్థ మార్కెట్‌ వాటా నిలకడగా

మరో గ్యాప్‌డౌన్‌ ఓపెనింగ్‌

Tuesday 9th July 2019

కేంద్ర బడ్జెట్‌ ప్రతిపాదనల పట్ల నిరుత్సాహంతో క్రితం రోజు భారీగా నష్టపోయిన భారత్‌ సూచీలు మంగళవారం సైతం గ్యాప్‌డౌన్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 38,580 పాయింట్ల సమీపంలో ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ  50 పాయింట్ల క్షీణతతో 11,505 పాయింట్ల వద్ద మొదలయ్యింది.  ప్రపంచ సూచీల క్షీణత.. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లు తగ్గించబోదన్న అంచనాలు మొదలైన నేపథ్యంలో గత రాత్రి అమెరికా సూచీలు క్షీణించగా తాజాగా ఆసియా మార్కెట్లు  నష్టపోయాయి. హాంకాంగ్‌

Most from this category