News


2 నెలల గరిష్టానికి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌

Wednesday 20th November 2019
Markets_main1574242176.png-29733

మార్కెట్‌ ప్రారంభం నుంచి ఫార్మా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఫార్మా షేర్లు వరుసగా నాలుగో రోజూ లాభాల బాట పట్టాయి. ఈ క్రమంలో ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 2నెలల గరిష్టాన్ని అందుకుంది. అమెరికా చైనాల మధ్య తొలగని అనిశ్చితి దేశీయ ఫార్మా రంగానికి మరింత డిమాండ్‌ను పెంచుతుందనే విశ్లేషకుల అశావహన అంచనాలు, ఫార్మా కంపెనీల ఆదాయాలపై ప్రభావాన్ని చూపే రూపాయి డాలర్‌ మారకంలో 15పైసలు నష్టంతో ట్రేడ్‌ అవుతుండటం ఫార్మా షేర్లకు కలిసొస్తుంది. ఈ రంగానికి చెందిన సన్‌ ఫార్మా, అరబిందో షేర్లు 7నుంచి 3శాతం లాభపడటంతో ఇండెక్స్‌ ర్యాలీ చేసింది. మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ సన్‌ ఫార్మాకు చెందిన మూడేళ్ల ఆర్థిక సంవత్సరపు త్రైమాసిక ఫలితాలను ఫోర్సెనిక్‌ ఆడిట్‌ చేస్తున్న నేపథ్యంలో సన్‌ఫార్మా షేరు నేటి ట్రేడింగ్‌లో 7శాతం లాభపడింది. వరుస 4ట్రేడింగ్‌ సెషన్‌లో 11శాతం వరకు పెరిగింది. అలాగే లుపిన్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, దివిస్‌ ల్యాబ్స్‌, అరబిందో ఫార్మా షేర్లు 3శాతం వరకు ర్యాలీ చేశాయి. అలాగే గ్లెన్‌మార్క్‌, కేడిల్లా, సిప్లా షేర్లు 2శాతానికి మించి ర్యాలీ చేశాయి. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(7,851.45)తో పోలిస్తే 4.14శాతం లాభంతో 8,176.40 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

4 సెషన్లలో 170 శాతం ర్యాలీ.. ఇప్పుడు కొనొచ్చా?

Wednesday 20th November 2019

వీఐఎల్‌ షేరుపై నిపుణుల సూచన గత నాలుగు సెషన్లులో వొడాఫోన్‌ ఐడియా షేరు దాదాపు 170 శాతం ర్యాలీ జరిపింది. డిసెంబర్‌ 1నుంచి టారిఫ్‌లు పెంచుతామన్న కంపెనీ ప్రకటన షేరుపై ఆసక్తి పెంచింది. వీఐఎల్‌తో పాటు ఎయిర్‌టెల్‌, జియో సైతం రేట్లు పెంచుతామని ప్రకటించాయి. మరోవైపు ఐటీ శాఖ నుంచి కంపెనీకి రూ. 7వేల కోట్లు రావాల్సిఉంది. ఈ రిఫండ్‌ కోరుతూ కంపెనీ ఐటీ శాఖకు లేఖ రాసినట్లు తెలిసింది. ఒకపక్క

బీపీసీఎల్‌ 4 శాతం అప్‌

Wednesday 20th November 2019

కంపెనీలో కేంద్రం వాటా విక్రయ వార్తలతో గత కొద్దిరోజులుగా ర్యాలీ చేస్తున్న బీపీసీఎల్‌ షేరు బుధవారం అదే జోరును కనబరుస్తుంది. నేడు ఈ కంపెనీ షేరు బీఎస్‌ఈలో రూ.519.35 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు దిగిరావడంతో పాటు నేడు జరిగే కేంద్ర ప్రభుత్వ కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వరంగ కంపెనీల్లో వ్యూహాత్మక వాటా విక్రయం అంశంపై చర్చించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఆయిల్‌ కంపెనీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది.

Most from this category