News


ఫార్మా షేర్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ సెగ

Monday 23rd September 2019
Markets_main1569225785.png-28494

యూఎస్‌ఎఫ్‌డీఏ సంబంధిత సమస్యల కారణంగా ఫార్మా ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన డాక్టర్‌ రెడ్డీస్‌, లుపిన్‌, సిప్లా షేర్ల పతనంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ నష్టాల బాట పట్టింది. ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 8,063.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఇండెక్స్‌ 1.21శాతం ర్యాలీ చేసింది. అనంతరం ఇండెక్స్‌లో ప్రధాన షేర్ల పతనంతో తిరిగి నష్టాల్లోకి మళ్లింది. రూపాయి బలపడటం కూడా ఫార్మా షేర్ల ర్యాలీకి ప్రతికూలంగా మారింది.
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌:- జీర్ణాశయ సంబంధిత వ్యాధుల చికిత్సలో వినియోగించే రానిటిడిన్ ఔషధంపై యూఎస్‌ఎఫ్‌డీఏ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ ఔషధాల సప్లైని నిలివేస్తున్నట్లు కంపెనీ స్టాక్‌ ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఫలితంగా కంపెనీ షేర్లు 5శాతం నష్టపోయాయి.
లుపిన్‌ ఫార్మా:- మహారాష్ట్రలోని తారాపూర్‌ యూనిట్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ 3 అబ్జర్వేషన్లను జారీ చేయడంతో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనై ఇంట్రాడే 4శాతం మేర నష్టపోయాయి. 
సిప్లా లిమిటెడ్‌:- బెంగుళూర్‌ యూనిట్‌లో జూలై 15-19 తేదీ మధ్య తనిఖీలు చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ.. యూనిట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ ఇస్పెక్షన్‌ రిపోర్ట్‌(ఈఐఆర్‌)ను జారీ చేయడంతో 3శాతం నష్టపోయింది. 
బయోకాన్‌:- బెంగుళూర్‌ యూనిట్‌లో సెప్టెంబర్‌ 10-19 తేదిల మధ్య తనిఖీలు చేసిన యూఎస్‌ఎఫ్‌డీఏ 8 అబ్జర్వేషన్లు పూర్తి చేసినట్లు గుర్తించి ఫామ్‌-483ను జారీ చేసినట్లు ఎక్చ్సేంజీలకు సమాచారం ఇచ్చింది. ఫలితంగా షేర్లు ఇంట్రాడేలో 1.50శాతం నష్టపోయాయి. 
వీటితో పాటు సన్‌ఫార్మా, దివీస్‌ ల్యాబ్స్‌, షేర్లు 1.50శాతం నుంచి అరశాతం నష్టపోయాయి.  
మధ్యాహ్నం గం.1:00లకు నిఫ్టీ పార్మా ఇండెక్స్‌ క్రితం ముగింపు(7,983.55)తో పోలిస్తే 2శాతం నష్టంతో 7,823.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్ల జోరు

Monday 23rd September 2019

కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రకటనతో ప్రభుత్వరంగ షేర్లు భారీగా లాభాల బాట పట్టాయి.  బీఎస్‌ఈలో ప్రభుత్వరంగ కంపెనీలకు ప్రాతినిథ్యం వహించే బీఎస్‌ఈ పీఎస్‌యూ ఇండెక్స్‌ దాదాపు 3శాతానికి పైగా లాభపడింది. ప్రభుత్వరంగ షేర్లైన ఓఎన్‌జీసీ,  కోల్‌ ఇండియా, ఐఓసీ షేర్లు దాదాపు 5శాతం వరకు ర్యాలీ చేశాయి. కేంద్రం కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో ఎక్కువగా ప్రభుత్వరంగ కంపెనీలకు లాభాన్ని చేకూర్చుస్తాయనే అంచనాలు ఈ రంగ షేర్లకు డిమాండ్‌ను పెంచుతున్నాయి.

బుల్‌ రన్‌..సెన్సెక్స్‌ 1237, నిఫ్టీ 384 పాయింట్లు అప్‌

Monday 23rd September 2019

‍ప్రభుత్వం దేశీయ కంపెనీలపై విధిస్తున్న కార్పోరేట్‌ ట్యాక్స్‌ను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు భారీ స్థాయిలో లాభపడి ట్రేడవుతున్నాయి. గత సెషన్‌లో మొదలైన బుల్స్‌ ఆధిపత్యం సోమవారం ట్రేడింగ్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యాహ్నాం 12.15 సమయానికి దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు నిఫ్టీ 50 384.20 పాయింట్లు లేదా 3.41 శాతం పెరిగి 11,658.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అదేవిధంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌

Most from this category