News


12200 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Monday 27th January 2020
Markets_main1580097858.png-31224


అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 102.51 పాయింట్ల నష్టంతో 41,510.68 వద్ద, నిఫ్టీ 12200 దిగువన 51పాయింట్ల నష్టంతో 12,197.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

 కరోనా వైరస్ వ్యాప్తి చైనా ఆర్థిక వ్యవస్థను, ప్రపంచ వృద్ధిని తీవ్రంగా దెబ్బతీస్తుందనే ఆందోళనలతో పాటు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న అమెరికా రిజర్వ్‌ బ్యాంకు సమావేశాల నేపథ్యంలో అప్రమత్తతతో అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన వాతావరణం నెలకొంది. ఫలితంగా నేడు అటు ఆసియాలో ప్రధాన మార్కెట్లతో పాటు అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. అయితే అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు దిగిరావడం మన మార్కెట్‌కు కొంత ఊరటనిచ్చే అంశంగా ఉంది. 

ఇక దేశీయ అంశాలను పరిశీలిస్తే... ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 19పైసల నష్టంతో ప్రారంభమైంది. ఈ వారం చివరి రోజైన శనివారం కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటం, కంపెనీల క్యూ3 ఫలితాలు విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచింది.

ఉదయం గం.9:30ని.లకు సెన్సెక్స్‌ 250 పాయింట్లు నష్టపోయి 41,367.08  వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు క్షీణించి 12,158.30 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక్క రియల్టీ రంగ షేర్ల తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అత్యధికంగా మెటల్‌ షేర్లు నష్టపోతున్నాయి. 


ఇదే సమయానికి నిఫ్టీ -50 ఇండెక్స్‌లో.... టాటామోటర్స్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, వేదాంత, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు 1.50శాతం నుంచి 4శాతం నష్టపోయాయి. ఐషర్‌మోటర్స్‌, యూపీఎల్‌, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు 0.10శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం డౌన్‌

Monday 27th January 2020

కరోనా వైరస్‌ ధాటికి ముడిచమురు ధరలతోపాటు.. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు బలహీనపడుతున్నాయి. మరోపక్క రక్షణాత్మక పెట్టుబడి సాధనాలుగా భావించే పసిడి, జపనీస్‌ కరెన్సీ యెన్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. కరోనా వైరస్‌ ఇతర దేశాలకూ పాకుతున్న వార్తలతో తాజాగా జపనీస్‌ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తగా.. యూఎస్‌ ఫ్యూచర్స్‌ సైతం నేలచూపులతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 249 పాయింట్లు క్షీణించి

లాభాల్లో ఐసీఐసీఐ బ్యాంకు షేరు

Monday 27th January 2020

డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు షేరు సోమవారం లాభాల్లో ఆరంభమైంది. గత ముగింపు రూ.533.85తో పోలిస్తే దాదాపు ఐదు రూపాయల లాభంతో రూ. 538.50 వద్ద షేరు ఆరంభమైంది. అనంతరం రూ. 543.70 వరకు ఎగిసి 9.20 నిమిషాల వద్ద దాదాపు 1.3 శాతం లాభంతో రూ. 540 వద్ద కదలాడింది. షేరు ప్రస్తుతం తన స్వల్పకాలిక డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతోంది. సోమవారం

Most from this category