News


11000 దిగువన ప్రారంభమైన నిఫ్టీ

Thursday 29th August 2019
Markets_main1567050950.png-28078

జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న బలహీన సంకేతాల అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ గురువారం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 150 పాయింట్ల నష్టంతో 37300 వద్ద, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో 11000 దిగువున 10,996.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. నేడు ఆగస్ట్‌ నెల డెరివేటివ్స్‌ ముగింపు కావడంతో పాటు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు తగ్గకపోవడంతో పాటు యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ వైదొలిగే ప్రక్రియ (బ్రెగ్జిట్‌) ఉండకపోవచ్చనే ఊహాగానాలు తెరపైకి రావడంతో నేడు ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. ఇక దేశీయ పరిణామాల విషయానికొస్తే.. నేడు ఆగస్ట్‌ నెల డెరివేటివ్స్‌ ముగింపు కావడంతో పాటు, ఈక్విటీ మార్కెట్‌ నుంచి ఎఫ్‌పీఐలు తమ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగిస్తుండటం, డాలర్‌ మారకంలో రూపాయి నష్టాల ప్రారంభం,, ఈ నెలాఖరున(ఆగస్ట్‌ 31న) దేశీయ క్యూ1 జీడీపీ గణాంకాల విడుదల నేపథ్యంలో అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తుండటం మార్కెట్‌పై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.  ఉదయం గం.9:20ని.లకు నిఫ్టీ 41.40 పాయింట్ల లాభంతో 11,004.70 వద్ద, సెన్సెక్స్‌ 162.01 పాయింట్లు పెరిగి 37,289.83 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో నెలకొన్న అమ్మకాలతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం నష్టంతో 27,640.35 వద్ద  కదలాడుతుంది. ఫార్మా, మీడియా తప్ప అన్ని రంగాలకు చెందిన అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. అత్యధికంగా ఐటీ షేర్లు నష్టపోతున్నాయి. 
యస్‌బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, గ్రాసీం, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌ షేర్లు 1శాతం నుంచి 5శాతం నష్టపోగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐషర్‌మోటర్స్‌, మారుతి సుజుకీ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, సన్‌ఫార్మా షేర్లు అరశాతం నుంచి 4.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

71.90 వద్ద రూపీ ప్రారంభం

Thursday 29th August 2019

 దేశియ రూపీ డాలర్‌ మారకంలో 14 పైసలు బలహీనపడి గురువారం 71.90 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్య భయాలు పెరగడంతో ఇన్వెస్టర్లు జపనీస్‌ యెన్‌ వంటి సురక్షితమైన ఆస్తుల వైపు ఆకర్షితులవుతున్నారు. ఫలితంగా గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 29 పైసలు బలహీనపడి 71.77 వద్ద ముగిసింది.  గత సెషన్‌లో డాలర్‌-రూపీ సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌ 72.04 గా ఉందని, ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 16.52 శాతం పెరిగిందని ఐసీఐసీఐ

200డీఎంఏ దాటితేనే ర్యాలీ...!

Thursday 29th August 2019

నిఫ్టీ50 ఇండెక్స్‌ కీలకమైన 200 డీఎంఏ స్థాయి(11,205)ని క్లోజింగ్‌లో అధిగమించినప్పుడే మార్కెట్లో స్థిరమైన ర్యాలీ సాధ్యపడుతుందని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. సూచీల కదలికలపై ఆయన విశ్లేషణ ఇలా ఉంది...   ‘‘బుధవారం మరో అస్థిర సెషన్‌ కొనసాగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఆరంభంలో లాభాల్లోనే ఉన్నప్పటికీ చివరికి మూడు రోజుల లాభాలకు బ్రేక్‌ పడింది. సూచీ 59 పాయింట్ల నష్టంతో (0.53శాతం) 11,046.10

Most from this category