News


నిఫ్టీ 100 పాయింట్లు... సెన్సెక్స్‌ 300 పాయింట్లు క్రాష్‌

Tuesday 3rd September 2019
Markets_main1567482904.png-28154

మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం దేశీయ మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 141 పాయింట్లు నష్టంతో 37,181.76 వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల పతనంతో 11000 దిగువున 10,960.95 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌(క్యూ1)లో దేశ జీడీపీ ఆరేళ్లలోనే కనిష్టానికి పతనమైన 5శాతమే పురోగతి సాధించడటం, పీఎస్‌యూ బ్యాంకులను విలీనం, వస్తు తయారీ రంగం పనితీరు ఆగస్టులో 15నెలల కనిష్టానికి పడిపోవడం, జీఎస్‌టీ వసూళ్లు ఆగస్ట్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే అత్యల్పంగా నమోదుకావడం, ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టడం తదితర అంశాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ఇక అంతర్జాతీయ అంశాలు విషయానికోస్తే.. లేబర్‌ డే సందర్భంగా అమెరికా మార్కెట్లు సోమవారం పనిచేయలేదు. వాణిజ్య చర్చలపై ఆశావహంతో నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి. ఉదయం గం.9:20నిల.కు సెన్సెక్స్‌ 309 పాయింట్లు నష్టంతో 37,023.49 వద్ద, నిఫ్టీ 100 పాయింట్ల పతనంతో 10,921.75 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఒక్క ఐటీ ఇండెక్స్‌ తప్ప మిగిలిన అన్ని రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. బ్యాంకింగ్‌, మెటల్‌, ఆర్థిక రంగ షేర్లు అత్యధికంగా నష్టపోతున్నాయి. 

ఎంఅండ్‌ఎం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటామోటర్స్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఐఓసీ షేర్లు 3శాతం నుంచి 3.50శాతం నష్టపోయాయి. హీరోమోటోకార్ప్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం వరుకు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. 
 



You may be interested

72 దిగువకు రూపీ

Tuesday 3rd September 2019

డాలర్‌ మారకంలో రూపీ మంగళవారం ట్రేడింగ్‌లో 55 పైసలు బలహీనపడి 71.95 వద్ద ప్రారంభమై..కొద్ది సమయంలోనే 72 దిగువకు జారిపోయింది. దేశియ ఈక్విటీ సూచీలు పాజిటివ్‌గా ట్రేడవ్వడంతో పాటు, యుఎస్‌-చైనా మధ్య వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభమవుతాయనే అంచనాల నేపథ్యంలో గత సెషన్‌లో(శుక్రవారం) రూపీ డాలర్‌ మారకంలో 38 పైసలు బలపడి 71.40 వద్ద ముగిసింది. గత సెషన్‌లో ఇంటర్‌బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్సెంజ్‌ వద్ద రూపీ డాలర్‌ మారకంలో 71.76

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 3rd September 2019

వస్తు తయారీ రంగం పనితీరు ఆగస్టులో 15నెలల కనిష్టానికి పడిపోయింది.  భారత జీడీపీ క్యూ1లో వృద్ధిరేటు వరుసగా ఆరో త్రైమాసికంలో పతనమైంది.  జీఎస్‌టీ వసూళ్లు ఆగస్ట్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలోనే  అత్యల్పంగా రూ.98, 202 కోట్లు వసూళ్లయ్యాయి.  ఆగస్టులో వాహన విక్రయాలు భారీగా తగ్గుముఖం పట్టాయి.  రియలన్స్‌ కమ్యూనికేషన్స్‌:- డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌కు వ్యతిరేకంగా ధాఖలు చేసిన పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంది.  బయోకాన్‌:- యూఎస్‌ఎఫ్‌డీఏ ఇన్సులిన్ గ్లార్జిన్ ఔషధానికి సీఆర్‌ఎల్‌(కంప్లీట​ రెస్పాన్స్‌ లెటర్‌)ను కేటాయించింది.  ఎస్‌పీఎంల్‌ ఇన్ఫ్రా:- ప్రపంచ

Most from this category