News


11950 దిగువన నిఫ్టీ ప్రారంభం

Wednesday 12th June 2019
Markets_main1560312026.png-26234

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం నష్టంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 100 పాయింట్ల నష్టంతో 39850 వద్ద, నిఫ్టీ 30 పాయింట్ల తగ్గుదలతో 11935 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వరుసగా ఆరు రోజులపాటు ర్యాలీ చేసిన అమెరికా మార్కెట్లో  లాభాల స్వీకరణతో నిన్న రాత్రి నష్టాల్లో ముగిశాయి. వాణిజ్య యుద్ధ భయాలు మరోసారి తెరపైకి రావడంతో ఆసియా మార్కెట్లు నేడు నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌ ప్రారంభం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఉదయం గం.9:20ని.లకు  సెన్సెక్స్‌ 141.89  పాయింట్ల నష్టంతో 39808 వద్ద, నిఫ్టీ 45.10 పాయింట్ల పతనంతో 11,920.50 వద్ద ట్రేడింగ్‌ అవున్నాయి. ఒక్క మెటల్‌, ఇంధన రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్నాయి. ఫైనాన్స్‌ రంగ షేర్లలో అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. 

హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫ్రాటెల్‌, హీరోమోటోకార్ప్‌, యస్‌ బ్యాంక్‌, ఇండియన్‌బుల్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్లు 1శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, టాటామోటర్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, వేదాంత, టాటా స్టీల్‌, ఏషియన్‌ పేయింట్స్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. You may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 12th June 2019

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం ప్రభావితమయ్యే షేర్ల వివరాలు  అదానీ గ్రీన్‌:- ప్రమోటర్లు ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా 6శాతం వాటాను విక్రయించనున్నారు. నేఢు ప్రారంభం కానున్న ఈ ఓపెన్‌ ఆఫర్‌ రేపటితో ముగియనుంది. ఇందుకు షేరు ఫ్లోర్‌ ధరను రూ.43లుగా నిర్ణయించారు.  ఇండియా సిమెంట్స్‌:- ప్రమోటర్‌ తనఖా పెట్టిన 1.68శాతం వాటాను సోమవారం విడుదల అయ్యాయి. వోల్టాస్‌:- కంపెనీ సీఎఫ్‌ఓగా అభిజిత్ గజేంద్రకద్కర్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో డిప్యూటీ ఎండీగా సేవలు అందిస్తున్న జార్జ్‌

ఏ మ్యూచువల్‌ ఫండ్‌ ఏ షేర్లలో ఇన్వెస్ట్‌ చేసింది...?

Tuesday 11th June 2019

దేశీయంగా అగ్రస్థాయి అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీలు) మే నెలలో కొనుగోళ్ల, అమ్మకాలను పరిశీలిస్తే కాంట్రా బెట్స్‌ పట్ల ఆసక్తి చూపించినట్టు తెలుస్తోంది. ఎన్నికల ఫలితాలు వచ్చేయడంతో రాజకీయ స్థిరత్వం ఏర్పడడం ఏఎంసీల ఆలోచన మారిందనేందుకు నిదర్శనం. బాగా పడిపోయిన టెలికం, విద్యుత్‌, ఫార్మా, మెటల్స్‌ షేర్లు ర్యాలీ చేస్తాయని ఏఎంసీలు అంచనా వేస్తున్నాయి. కొన్ని ఆటో యాన్సిలరీ, బ్యాంకు స్టాక్స్‌ సైతం ఏఎంసీలను ఆకర్షించాయి. మే నెల నాటికి

Most from this category