News


170 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్‌ ప్రారంభం

Thursday 27th February 2020
Markets_main1582775842.png-32127

  • 11650 దిగువన మొదలైన నిఫ్టీ
  • మార్కెట్లో కొనసాగుతున్న కరోనా భయాలు

అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి బలహీన సంకేతాలను అందిపుచ్చుకున్న మార్కెట్‌ గురువారం మరోసారి నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 170 పాయింట్ల నష్టంతో 39718 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్లను కొల్పోయి 11632 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ వ్యాధి భయాలు ఈక్విటీ మార్కెట్లను ఇంకా వెంటాడుతుండటంతో నిన్న రాత్రి అమెరికా మార్కెట్లతో పాటు, నేడు ఆసియా మార్కెట్లు సైతం నష్టాలను చవిచూవిచూశాయి. ఇక అంశాల విషయానికొస్తే... నేడు ఫిబ్రవరి  ఎఫ్‌ అండ్‌ ఓ డెరివేటివ్స్‌ కాంటాక్టు ముగింపు నేప‌థ్యంలో మ‌దుప‌ర్లు అప్రమ‌త్తత వ‌హిస్తున్నారు. నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో 1పైస బలపడి 71.65 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైంది. ఒక్క ప్రైవేట్‌రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా ఐటీ షేర్లు ఎక్కువగా నష్టపోతున్నాయి. 

జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, గ్రాసీం, సిప్లా షేర్లు 1శాతం 1.50శాతం నష్టపోయాయి. నెస్లేఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, హీరోమోటర్స్‌, ఎన్‌టీపీసీ, యస్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 1.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

స్టాక్స్‌, చమురు ధరలకు కరోనా సెగ

Thursday 27th February 2020

వరుసగా ఐదో రోజు అమెరికా మార్కెట్ల పతనం నాలగో రోజూ నేలచూపులతో ముడిచమురు ఐదు రోజుల్లో ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 8 శాతం డీలా 50 డాలర్ల దిగువకు నైమెక్స్‌ బ్యారల్‌ ఏడాది కనిష్టానికి చేరిన ముడిచమురు ధరలు చైనాలో పుట్టి ఇరాన్‌, దక్షిర కొరియాసహా పలు దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ తాజాగా అమెరికాలోనూ వ్యాపించనున్న భయాలు తలెత్తాయి. దీంతో ప్రపం‍చవ్యాప్తంగా అటు స్టాక్స్‌, ఇటు ముడిచమురు పతనంకాగా.. ట్రెజరీ బాండ్లకు డిమాండ్‌ పెరిగింది. ఇప్పటికే వ్యాధుల

నేడు మరోసారి నష్టాల ఓపెనింగ్‌!

Thursday 27th February 2020

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 27 పాయింట్లు మైనస్‌ నేడు నిఫ్టీకి 11,618 వద్ద తొలి సపోర్ట్‌! వరుసగా ఐదో రోజు ఎస్‌అండ్‌పీ డీలా   నేడు(గురువారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.30  ప్రాంతం‍లో 27 పాయింట్లు క్షీణించి 11,671 వద్ద ట్రేడవుతోంది. మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఫిబ్రవరి ఫ్యూచర్‌ 12,698 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Most from this category