News


సెన్సెక్స్‌ 1000 పాయింట్లు క్రాష్‌

Friday 28th February 2020
Markets_main1582861881.png-32153

  • 11350 వద్ద నిఫ్టీ ప్రారంభం
  • మార్కెట్‌కు కరోనా వైరస్‌ భయాలు

కరోనా వైరస్‌ వ్యాధి భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న కలవరం దేశీయ ఈక్విటీ మార్కెట్‌ తాకింది. ఫలితంగా శుక్రవారం బెంచ్‌ మార్కెట్‌ ఇండెక్స్‌లు భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 1000 పతనమైన 39000ల దిగువన 38746.95 మొదలైంది. నిఫ్టీ 270 పాయింట్లు క్షీణించి 11353.70 సమీపంలో ప్రారంభమైంది. నేటి మార్కెట్‌ ముగింపు అనంతరం ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మూడో త్రైమాసికపు జీడీపీ గణాంకాలు విడుదల కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత వహిస్తున్నారు. నేడు ఫారెక్స్ మార్కెట్‌ డాలర్‌ మారకంలో రూపాయి విలువ నిన్నటి ముగింపు(71.55)స్థాయితో పోలిస్తే 38పైసలు బలహీనపడి 71.93 వద్ద ప్రారంభమైంది. ఈ కారణాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.

ఇక అంతర్జాతీయ మార్కెట్లో వృద్ధి భయాలతో క్రూడాయిల్‌ ధర వరుసగా ఆరోరోజూ నేలచూపులు చూస్తోంది. ఈ వారంలో బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఏకంగా 12శాతం నష్టాన్ని చవిచూసింది. ఈ క్రూడాయిల్‌ పతనం మాత్రమే మన మార్కెట్‌కు కొంతకలిసొచ్చే అంశంగా ఉంది.

కరోనా వైరస్‌ ఎదుర్కోవడానికి ధనిక దేశాలతో సహా అన్ని దేశాలు సిద్ధం కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటనతో గతరాత్రి అమెరికా స్టాక్‌ సూచీలు 4శాతం పైనా పతనమయ్యాయి. ఆ దేశ ప్రధాన ఇండెక్స్‌లైన డౌ జోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్ 1191 పాయింట్లు, ఎస్‌అండ్‌పీ ఇండెక్స్‌ 138 పాయింట్లు, నాస్‌డాక్‌ 414 పాయింట్లు నష్టపోయాయి. ఈ కారణంతో శుక్రవారం ఉదయం ఆసియాలోని ప్రధాన సూచీలు సైతం 3శాతం మేర తగ్గాయి. 


అన్ని రంగాల షేర్లు అమ్మకాలు భారీగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అత్యధికంగా మెటల్‌ షేర్లు భారీ నష్టాలను చవిచూశాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ సైతం 2.50శాతం నష్టంతో 25వేల దిగువన 29,447 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది.  


ఇక నిఫ్టీ-50 ఇండెక్స్‌లో ... టెక్‌ మహీంద్రా, హిందాల్కో, వేదాంత, టాటాస్టీల్‌, టాటా మోటర్స్‌ షేర్లు 4.50శాతం నుంచి 6.50శాతం నష్టాన్ని చవిచూశాయి. ఏ ఒక్క షేరు కూడా లాభంతో ట్రేడింగ్‌ కావడం లేదు. You may be interested

బాకీలు కట్టలేం బాబోయ్‌..!

Friday 28th February 2020

బాకీలు కట్టే పరిస్థితి లేదు.. విడతలవారీగా చెల్లించేందుకు అవకాశమివ్వాలి కనీస చార్జీల విధానం అమలు చేయాలి ఏజీఆర్‌పై కేంద్రానికి వొడా ఐడియా లేఖ న్యూఢిల్లీ: నష్టాలు, రుణాలతో కుదేలవుతున్న టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియాకు తాజాగా ఏజీఆర్ బాకీలు మరింత భారంగా మారాయి. దీంతో ప్రస్తుతం ఏజీఆర్‌ బకాయిలను కట్టే పరిస్థితుల్లో లేమని కేంద్ర సమాచార శాఖకు కంపెనీ లేఖ రాసింది. సంక్షోభంలో ఉన్న టెలికం రంగంలో కనీస చార్జీ విధానం అమలుకు అనుమతించడంతో పాటు

ఫుడ్‌ డెలివరీలోకి అమెజాన్‌

Friday 28th February 2020

ప్రస్తుతం బెంగళూరులో పైలట్‌ ప్రాజెక్టు మార్చిలో పూర్తి స్థాయిలో ఆవిష్కరించే అవకాశం ప్రైమ్‌ నౌ యాప్‌ ద్వారా అందుబాటులోకి న్యూఢిల్లీ: అమెరికన్‌ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ .. భారత్‌లో కార్యకలాపాలను జోరుగా విస్తరిస్తోంది. కేవలం ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌కే పరిమితం కాకుండా కొత్త విభాగాల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా ఫుడ్‌ డెలివరీ సేవలను కూడా ప్రారంభించనుంది. తద్వారా ఈ విభాగంలో దిగ్గజాలైన స్విగీ, జొమాటోలకు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఫుడ్‌ డెలివరీ వ్యాపారాన్ని మార్చిలో ప్రకటించవచ్చని,

Most from this category