News


10850ల దిగువన నిఫ్టీ

Monday 5th August 2019
news_main1564977346.png-27530

ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న దేశీయ మార్కెట్‌ సోమవారం నష్టంతో ప్రారంభమైంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 276 క్షీణతతో 36842 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 101 పాయింట్ల పతనంతో 10895 వద్ద మొదలయ్యాయి. మార్కెట్ ప్రారంభమైన కొద్ది క్షణాల్లోనే గతవారపు కనిష్టస్థాయి 10850ల స్థాయికి పతనమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో అత్యధికంగా మెటల్‌ షేర్లు నష్టపోయాయి. వేదాంత, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటాస్టీల్‌ షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం క్షీణించాయి. మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కోంటున్న ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌ 4శాతం నష్టంతో ప్రారంమైంది. ఇక బ్యాంకింగ్‌ ఎస్‌బీఐ రూ.300 దిగువన, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 2శాతం నష్టంతో ప్రారంభమయ్యాయి. రిలయన్స్‌ 2.50శాతం నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. రూపాయి భారీ క్షీణత కారణంగా ఐటీ షేర్లు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు స్వల్ప లాభంతో మొదలయ్యాయి. You may be interested

రూపాయి భారీ పతనం...70.46 స్థాయికి

Monday 5th August 2019

అంతర్జాతీయ సంకేతాలతో పాటు, దేశియ మార్కెట్లు వరుస సెషన్‌లలో భారీగా నష్టపోతుండడంతో రూపీ డాలర్‌ మారకంలో సోమవారం 55 పైసలు బలహీనపడి 70.46 వద్ద ట్రేడవుతోంది. గత సెషన్‌లో రూపీ డాలర్‌ మారకంలో 69.59 వద్ద ముగిసింది. మొత్తంగా గత వారంలో రూపీ డాలర్‌ మారకంలో 71 పైసలు బలహీనపడింది. ఈ ఏడాది మే 17 తర్వాత ఇదే రూపీకి కనిష్టస్థాయి కావడం గమనర్హం. అంతర్జాతీయంగా రెండు పెద్ద దేశాల

సోమవారం వార్లల్లోని షేర్లు

Monday 5th August 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా సోమ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు జుబిలెంట్ లైఫ్‌:- క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్ల జారీ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.40 కోట్ల నిధుల‌ను స‌మీక‌రించింది. కాక్స్ అండ్ కింగ్స్‌:-  రూ.100 కోట్ల క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్ల చెల్లింపుల విఫ‌లమైంది.  మ‌న్‌ప‌సంద్ బేవ‌రీజెస్‌:- కంపెనీ ఆడిట‌ర్లుగా బాట్లిబాయ్ పురోహిత్ నియ‌మితుల‌య్యారు  పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్:- ఫెయిర్‌డీల్ స‌ప్లై ప్రైవేట్ లిమిటెడ్ రూ.40.50 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆర్‌బీఐకి స‌మాచారం ఇచ్చింది. అదానీ ప‌వ‌ర్:-  జీఎంఆర్ చ‌త్తీస్‌ఘ‌డ్ ఎన‌ర్జీ లిమిటెన్

Most from this category