News


లాభాలతో మార్కెట్‌ ప్రారంభం

Wednesday 29th January 2020
Markets_main1580271269.png-31281

  • 12100 పైన ప్రారంభమైన నిఫ్టీ
  • 200 పాయింట్లు లాభంతో మొదలైన సెన్సెక్స్‌
  • కలిసొచ్చిన షార్ట్‌ కవరింగ్‌
  • అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల వాతావరణం

రెండు రోజుల వరుస నష్టాల ముగింపు తర్వాత బుధవారం దేశీయ మార్కెట్‌ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభంతో 41158.00 వద్ద, నిఫ్టీ 59 పాయింట్లు పెరిగి 12,115 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ భయాలు కొంత తగ్గడంతో అంతర్జాతీ మార్కెట్లలో సానుకూల వాతవరణం నెలకొంది. నిన్నరాత్రి అమెరికా మార్కెట్లు లాభంతో ముగియగా, నేడు ఆసియా మార్కెట్లు సైతం లాభాల బాట పట్టాయి. ఈ వారంలో మొదటి రెండు రోజుల సూచీలు భారీ పతనాన్ని చవిచూసిన నేపథ్యంలో మార్కెట్లో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌కు పూనుకోవడం కలిసొచ్చింది. అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ నేటి రాత్రి కీలక వడ్డీరేట్లపై తన వైఖరి ప్రకటించనుండటంతో పాటు దేశీయంగా రేపు జనవరి నెల డెరివేటివ్స్ ముగింపు కావడం, పలు కీలక కంపెనీలు తమ క్యూ3 ఫలితాలను విడుదల చేయనుండటం, ఈ శనివారం కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండటం తదితర అంశాల నేపథ్యంలో ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశం ఉందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 221 పాయింట్ల లాభంతో 41,187.79 వద్ద, నిఫ్టీ 60.35 పాయింట్ల లాభంతో 12,116.15 వద్ద ట్రేడ్‌ అవుతోంది. అన్నిరంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. గత రెండు ట్రేడింగ్‌ సెషన్‌లో అత్యధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనైన మెటల్‌ షేర్లకు నేడు ఎక్కువగా లాభాల మద్దతు లభిస్తుంది. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభపడి 30,924 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

వేదాంత, ఇన్ఫ్రాటెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా స్టీల్‌, టాటా మోటర్స్‌ షేర్లు 1.50శాతం నుంచి 3శాతం లాభపడ్డాయి.  సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, సిప్లా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 0.10శాతం నుంచి అరశాతం నష్టపోయాయి.  



You may be interested

యాపిల్‌ ఫలితాల జోష్‌

Wednesday 29th January 2020

లాభాలతో ముగిసిన అమెరికా మార్కెట్లు డిసెంబర్‌ క్వార్టర్‌లో యాపిల్‌ అమ్మకాల జోరు ఆదాయంలో సగం వాటాను ఆక్రమించిన ఐఫోన్లు సరికొత్త గరిష్టానికి చేరువలో యాపిల్‌ షేరు   ఐఫోన్లు, ఐప్యాడ్‌ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ ఫలితాలపై అంచనాలు మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లకు జోష్‌నిచ్చాయి. వెరసి కరోనా వైరస్‌ ఆందోళనల నుంచి బయటపడి లాభాలతో ముగిశాయి. యాపిల్‌ పనితీరుపై అంచనాలతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో యాపిల్‌ షేరు దాదాపు 3 శాతం జంప్‌చేసింది. దాదాపు

నేడు క్యూ3 ఫలితాలను ప్రకటించే కొన్ని ప్రధాన కంపెనీలు

Wednesday 29th January 2020

బజాజ్‌ ఫిన్‌సర్వీసెన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ణ, భారత్‌ గేర్స్‌, బిర్లా కార్పోరేషన్‌, చోళమండలం ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌, క్రాం‍ప్టన్‌ గ్రావీస్‌ కన్జూ‍్యమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఎస్కార్ట్స్‌, గేర్‌వేర్‌ పాలీస్టర్‌, గోద్రేజ్‌ కన్జూ‍్యమర్‌ ప్రోడెక్ట్స్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బాయంక్‌, జుబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, టాటా పవర్‌, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌, కేపీఐటీ టెక్నాలజీస్‌ కంపెనీలతో పాటు సుమారు 68 కంపెనీలు తమ మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. 

Most from this category