News


11750ల పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 19th June 2019
Markets_main1560916828.png-26395

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 150 పాయింట్ల లాభంతో 39,176.56 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు పెరిగి 11,750.45 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. చైనాతో నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారం కోసం జీ - 20 సదస్సులో ఆ దేశాధ్యక్షుడు జి జిన్‌పింగ్‌తో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బుధవారం తెలిపారు. అలాగే ద్రవ్యోల్బణం వేగవంతం కాకపోతే, వడ్డీరేట్లపై కోత విధించేందుకు యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) సిద్ధంగా ఉందని ఈసీబీ అధ్యక్షుడు మారి డ్రాగీ ప్రకటించారు. మరోవైపు నేటి రాత్రి అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లపై తమ వైఖరిని ప్రకటించనుంది. వడ్డీరేట్లకు కోతకే ఫెడ్‌ మొగ్గుచూపవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితంగా నిన్న రాత్రి అమెరికా మార్కెట్లు 1శాతం ర్యాలీ చేయగా, నేడు ఆసియాలో మార్కెట్లు సైతం భారీ లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. ఇక దేశీయంగా ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి గత ముగింపు(69.70)తో పోలిస్తే 14 పైసల లాభంతో 69.56 వద్ద ప్రారంభమైంది. ఈ సానుకూలాంశాలతో నేడు దేశీయ మార్కెట్లో కూడా కొనుగోళ్లు నెలకొన్నాయి. ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 305.80 పాయింట్ల లాభంతో 39,352 వద్ద, నిఫ్టీ 78.30 పాయింట్లు పెరిగి 11,769.80 వద్ద ట్రేడింగ్‌ అవుతోంది. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. అత్యధికంగా బ్యాంకింగ్‌, మెటల్‌ షేర్లు లాభపడుతున్నాయి. 
జీ లిమిటెడ్‌, టాటామోటర్స్‌, హిందాల్కో, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, టాటా స్టీల్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం లాభపడగా, ఐఓసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, యస్‌ బ్యాంక్‌, విప్రో షేర్లు అరశాతం నుంచి 1శాతం నష్టపోయాయి.



You may be interested

14 పైసలు బలపడిన రూపీ

Wednesday 19th June 2019

డాలర్‌ మారకంలో రూపీ బుధవారం 14పైసలు బలపడి 69.56 వద్ధ ప్రారంభమైం‍ది.  గత మూడు రోజుల నుంచి నష్టపోతున్న రూపీ మంగళవారం 21పైసలు బలపడి 69.70 వద్ద ముగిసింది. తగ్గిన చమురు ధరలు, డాలర్‌ బలహీనంగా ఉండడంతో డాలర్‌ మారకంలో రూపీ బలపడుతోంది.  ఫెడరల్‌ బ్యాం‍క్‌ పాలసీ ప్రకటన ఈ రోజు వెలువడనున్న  నేపథ్యంలో డాలర్‌ ఒత్తిడికి గురికావచ్చు.  ఫెడరల్‌ ఓపినింగ్‌ మార్కెట్‌ కమిటీ(ఎఫ్‌ఓఎమ్‌సీ) ప్రకటన ముందు మదుపర్లు జాగ్రత్తను

హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ అనూహ్య నిర్ణయం

Wednesday 19th June 2019

హెచ్‌డీఎఫ్‌సీ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ (ఏఎంసీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. గడువు తీరిన ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్ల(ఎఫ్‌ఎంపీ) నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకుగాను రూ.500 కోట్ల కేటాయింపులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎస్సెల్‌ గ్రూపు కంపెనీల ఎన్‌సీడీల్లో హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ పలు పథకాల ద్వారా పెట్టుబడులు పెట్టింది. ఎస్సెల్‌ గ్రూపు కంపెనీలు తీవ్ర నిధుల సంక్షోభంలో చిక్కుకుపోవడంతో ఎన్‌సీడీలకు సకాలంలో చెల్లింపులు చేయలేకపోయాయి. వచ్చే సెప్టెంబర్‌ వరకు

Most from this category