News


700 పాయింట్ల భారీగ్యాప్‌అప్‌ తో సెన్సెక్స్‌ ప్రారంభం

Monday 2nd March 2020
Markets_main1583122016.png-32200

  • 11400 పైన నిఫ్టీ ప్రారంభం
  • భారీ స్థాయిలో షార్ట్‌కవరింగ్‌
  • ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు 

ఆరు రోజుల వరుస నష్టాల ముగింపు పలుకుతూ దేశీయ మార్కెట్‌ సోమవారం భారీ లాభంతో మొదలైంది. కరోనా వైరస్‌ భయాలతో ఆర్థిక మందగమన భయాలతో క్రితంవారం సూచీలు కనిష్ట స్థాయిలకి పతనమైన నేపథ్యంలో నేడు ట్రేడర్లు భారీ స్థాయిలో షార్ట్‌ కవరింగ్‌ను పాల్పడ్డారు. సెన్సెక్స్‌ 718.66 పాయింట్ల లాభంతో 39015.95 వద్ద, నిఫ్టీ 209.15 పాయింట్లు పెరిగి 11410.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కరోనా వైరస్‌ వ్యాధితో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు చేయూతనిచ్చేందుకు వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై పరిశీలన చేస్తామని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. అలాగే  జపాన్‌ దేశానికి చెందిన బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ సైతం ఉద్దీపన చర్చలు తీసుకుంటామని ప్రకటనతో ఆసియా మార్కెట్లో కొనుగోళ్ల నెలకొనడం కూడా మన ఇన్వెస్టర్లకు కొంత విశ్వాసాన్నిచ్చింది. ఇక ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి శుక్రవారం ముగింపు(72.17)తో పోలిస్తే 10పైసలు బలపడి 72.07 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. అత్యధికంగా మెటల్‌ షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. 

టీసీఎస్‌, కోల్‌ ఇండియా, రిలయన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, జీ లిమిటెడ్‌ షేర్లు 2.22శాతం నుంచి 3.36శాతం లాభపడ్డాయి. గెయిల్‌, టాటామోటర్స్‌, కోటక్‌ ఇండియా, ఎంఅండ్‌ఎం షేర్లు అరశాతం నుంచి 2.50శాతం నష్టాలను చవిచూశాయి. 



You may be interested

పీఎఫ్‌పై 8.65 శాతం వడ్డీ రేటు కొనసాగింపు!!

Monday 2nd March 2020

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ప్రావిడెంట్ ఫండ్‌ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) భావిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి 5న జరిగే ట్రస్టీల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2018-19లో కూడా ఇదే రేటు ఉంది. ‍అయితే, ఈ ఆర్థిక సంవత్సరంలో దీన్ని 8.5 శాతానికి తగ్గించవచ్చన్న అంచనాలు ఉన్నాయి. పోస్టాఫీస్ పొదుపు పథకాలు,

నేటి నుంచి ఎస్‌బీఐ కార్డ్స్‌ ఐపీఓ

Monday 2nd March 2020

ప్రైస్‌బాండ్‌ రూ.750-755 ఇష్యూ సైజు రూ.10,000 కోట్లు  మార్చి 16న లిస్టింగ్‌  న్యూఢిల్లీ: కోవిడ్‌-19(కరోనా) వైరస్‌ కల్లోలంతో స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ కంపెనీ ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తోంది. ఈ ఐపీఓ నేడు (సోమవారం) మొదలై మార్చి 5న ముగుస్తుంది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్‌ను రూ.750-755గా నిర్ణయించారు. కనీసం 19 షేర్లకు(మార్కెట్‌ లాట్‌) దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఈ ఐపీఓలో భాగంగా రూ.500 కోట్ల

Most from this category