News


12400పైన నిఫ్టీ ప్రారంభం

Monday 20th January 2020
Markets_main1579492775.png-31039

  • 300 పాయింట్లు లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌ 

అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలకు తోడు దేశీయ కార్పోరేట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల మూడో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను అంచనాలను అందుకోవడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభంతో మొదలైంది. ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 318 పాయింట్ల లాభంతో 42,263 వద్ద  నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 12400పై 12,430 వద్ద మొదలయ్యాయి. డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌గా ప్రారంభం కావడంతో ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అత్యధికంగా మెటల్‌ షేర్లు పెరిగాయి. 

శుక్రవారం మార్కెట్‌ అనంతరం క్యూ3 ఫలితాలను విడుదల చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టెక్‌ దిగ్గజం టీసీఎస్‌ ఫలితాలను విశ్లేషకుల అంచనాలకు అందుకుంది. శనివారం విడుదలైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మూడో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలకు అంచనాలకు మించిన నమోదయ్యాయి. దిగ్గజ కంపెనీల షేర్ల లాభాల ప్రారంభం కావడం ప్రధాన ఇండెక్స్‌లకు కలిసొచ్చింది.

ఇక అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే... అమెరికా ఆర్థిక గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కావడంతో పాటు  ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ద్రవ్యకొరత తీర్చే విధంగా చర్యలు తీసుకోనుడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొంది. ఫలితంగా శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు రికార్డు స్థాయిని అందుకొని లాభాల్లో ముగియగా, నేడు ఆసియాలో ప్రధాన ఈక్విటీ మార్కెట్లు 20నెలల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 

నిఫ్టీ -50 ఇండెక్స్‌లో.... యస్‌బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటామోటర్స్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు 1శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి. గ్రాసీం, విప్రో, వేదాంత, ఓఎన్‌జీసీ, ఐఓసీ షేర్లు అరశాతం నుంచి 6శాతం నష్టపోయాయి. 



You may be interested

12,400పైన నిలిస్తే నిఫ్టీ జోరు?!

Monday 20th January 2020

ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ అంచనా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇం‍డెక్స్‌ నిఫ్టీ 12,400 పాయింట్లకు ఎగువన నిలవగలిగితే.. తదుపరి మరింత జోరందుకునే వీలున్నట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ తాజాగా అంచనా వేసింది. అంచనాలు ఇలా.. గత వారం నిఫ్టీ కొత్త గరిష్టాలకు చేరింది. 13,352 వద్ద ముగిసింది. వారపు చార్టుల ప్రకారం చిన్న బుల్లిష్‌ కేండిల్‌ కనిపిస్తోంది. అయితే బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌ గరిష్టానికి చేరడంలో విఫలమైంది. గత వారం నికరంగా 1.6 శాతం క్షీణించి 31,591

Q3 ఎఫెక్ట్‌- తొలుత జోరు- తదుపరి డీలా(అప్‌డేటెడ్‌)

Monday 20th January 2020

గత వారాంతాన పలు దిగ్గజ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2019-20) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌), ఐటీ దిగ్గజాలు టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ శుక్రవారం మార్కెట్లు ముగిశాక ఫలితాలు ప్రకటించాయి. ఈ బాటలో శనివారం ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌) పనితీరును వెల్లడించింది. దీంతో ఈ కౌంటర్లు ఫలితాల ఆధారంగా నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో భిన్న రకాలుగా స్పందిస్తున్నాయి.  కాగా.. తొలుత

Most from this category