News


12000 పైన ప్రారంభమైన నిఫ్టీ

Wednesday 5th February 2020
Markets_main1580875442.png-31517

ప్రపంచమార్కెట్లను నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చకున్న దేశీయ మార్కెట్‌ బుధవారం వరుసగా మూడోరోజూ లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 132.33 పాయింట్ల​లాభంతో 40,921.71 వద్ద, నిఫ్టీ 26.2 పాయింట్లు పెరిగి 12వేలపై 12,005.85 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కరోనా వైరస్‌తో కారణంగా గాడి తప్పిన ఆర్థిక వ్యస్థను చక్కదిద్దేందుకు పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఈ ఫిబ్రవరి 20న జరిగే సమావేశంలో కీలక రుణ రేటును తగ్గిస్తుందని, రాబోయే వారాల్లో బ్యాంకుల రిజర్వ్ అవసరాల నిష్పత్తులను తగ్గించే అవకాశం ఉందనే వార్తలతో ఆసియాలో ప్రధాన మార్కెట్లు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. నిన్నరాత్రి అమెరికా సూచీలు సైతం 1.5శాతం లాభంతో ముగిశాయి. అంతర్జాతీయ క్రూడాయిల్‌ ధరలు ఇంకా కనిష్ట స్థాయిల వద్ద ట్రేడ్‌ అవుతుండటం దేశీయ మార్కెట్‌కు కలిసొచ్చింది. అయితే రేపు ఆర్‌బీఐ కీలక వడ్డీరేట్లపై తన వైఖరి తెలపనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత వహిస్తున్నారు. 

ఉదయం గం.9:20ని.లకు సెన్సెక్స్‌ 66.37 పాయింట్లు పెరిగి 40,855.75 వద్ద, నిఫ్టీ 23.40 పాయింట్ల లాభంతో 12,003.05 వద్ద ట్రేడింగ్‌ వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి. అటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫార్మా, ప్రైవేట్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. మరోవైపు ఆర్థిక, ‍ఐటీ, ఫైనాన్స్‌ సర్వీస్‌ రంగ షేర్లు స్వల్పంగా అమ్మకాల ఒత్తిడికిలోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 0.05శాతంతో 30, 674 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

ర్యాలీ కంటిన్యూ అంటున్న ఎఫ్‌పీఐలు!!

Wednesday 5th February 2020

దేశీయ సూచీలు బడ్జెట్‌ రోజు నష్టాలను అత్యంత వేగంగా పూడ్చుకొన్నాయి. నిఫ్టీ రెండ్రోజుల్లో తిరిగి 12000 పాయింట్ల పైకి చేరింది. వరుసగా మూడోరోజు కూడా సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. స్వల్పకాలానికి ఈ ట్రెండ్‌ కొనసాగుతుందని డెరివేటివ్స్‌ నిపుణులు చెబుతున్నారు. విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల లాంగ్‌ షార్ట్‌ రేషియో పరిశీలిస్తే నిఫ్టీ పాజిటివ్‌గానే ఉండొచ్చన్న సంకేతాలున్నాయంటున్నారు. ఫిబ్రవరి సీరిస్‌కు ఈ నిష్పత్తి 0.3 శాతానికి పడిపోయింది. ఈ స్థాయికి ఈ నిష్పత్తి

బిల్లు తీసుకుంటే రూ. 1 కోటి దాకా నజరానా

Wednesday 5th February 2020

జీఎస్‌టీని ప్రోత్సహించేందుకు కేంద్రం ప్లాన్‌ రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా లాటరీ న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. కొన్న ప్రతీ వస్తువుకు విక్రేతల నుంచి కచ్చితంగా బిల్లు తీసుకునేలా కొనుగోలుదారులను ప్రోత్సహించే చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రూ. 10 లక్షల నుంచి రూ. 1 కోటి దాకా బహుమతులు ఇచ్చేలా లాటరీని ప్రవేశపెట్టాలని

Most from this category