News


కొత్త ఏడాది తొలిరోజున శుభారంభం

Wednesday 1st January 2020
Markets_main1577851915.png-30579

  • బ్యాంకింగ్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు
  • 12200 పైన ప్రారంభమైన నిఫ్టీ 

కొత్త ఏడాది తొలిరోజున భారత మార్కెట్‌ శుభారంభం చేసింది. నూతన సంవత్సరానికి సూచీలు లాభాలతో స్వాగతం పలికాయి. అన్ని రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బుధవారం సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 96 పాయింట్లు లాభంతో 41349 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 12200పై 12,202.15 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ఎక్కువగా కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం లాభంతో 32,308.55 వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు డిసెంబర్‌ నెల వాహన విక్రయ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో అటో రంగ షేర్లు సైతం లాభాల బాట పట్టాయి. డాలర్‌ మారకంలో రూపాయి నిన్నటి రాత్రి ముగింపు(71.38)తో పోలిస్తే స్వల్పంగా 2 పైసలు బలపడి 2పైసల 71.38 వద్ద ప్రారంభమైంది. ఇక నేడు నూతన సంవత్సరం సందర్భంగా అటు ఆసియాతో పాటు యూరప్‌, అమెరికా మార్కెట్లు సైతం పనిచేయవు. 

అదానీ పోర్ట్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు 1శాతం నుంచి 2శాతం లాభపడ్డాయి. నెస్లే ఇండియా, గెయిల్‌, కోల్‌ ఇండియా, ఐషర్‌ మోటర్స్‌, ఎన్‌టీపీసీ షేర్లు పావుశాతం నుంచి అరశాతం నష్టపోయాయి. 



You may be interested

వర్ధమాన మార్కెట్లకు కొత్తేడాది కలిసివస్తుంది!

Wednesday 1st January 2020

నిపుణుల అంచనా అభివృద్ధి చెందిన దేశాల మార్కెట్లతో పోలిస్తే దశాబ్దకాలంగా వెనకంజ వేస్తూ వస్తున్న వర్ధమాన దేశాల ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది ట్రెండ్‌ రివర్సల్‌ చూస్తాయని నిపుణులు భావిస్తున్నారు. వర్ధమాన మార్కెట్ల(ఈఎం) వాల్యూషన్లు చౌకగా మారడం, ఈ దేశాల కంపెనీల ఎర్నింగ్స్‌ గ్రోత్‌లో వృద్ధిపై పెరిగిన అంచనాలు.. ఈఎంలను కొత్త ఏడాది పుంజుకునేలా చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే పలు గ్లోబల్‌ ఇన్వెస్టర్లు ఈఎంల్లో పెట్టుబడులు పెంచుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ

బుధవారం వార్తల్లో షేర్లు(1-1-20)

Wednesday 1st January 2020

కొత్త ఏడాది సందర్భంగా దాదాపు ప్రపంచ స్టాక్‌ మార్కెట్లన్నీ సెలవులో కొనసాగుతున్నాయి. దీంతో నేడు దేశీయంగా యాక్టివిటీ తక్కువగా నమోదయ్యే అవకాశమున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే కొన్ని కంపెనీల కౌంటర్లు వార్తల కారణంగా ట్రేడర్లను, ఇన్వెస్టర్లను ఆకట్టుకునే వీలున్నట్లు చెబుతున్నారు. తాజాగా వార్తలలో నిలిచిన ఆయా కంపెనీల వివరాలు చూద్దాం.. యాస్టర్‌ డీఎం హెల్త్‌కేర్‌ వాహత్‌ అల్‌ అమన్‌ హోమ్‌ హెల్త్‌కేర్‌లో వాటా కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఆరోగ్యపరిరక్షణ రంగ కంపెనీ యాస్టర్‌

Most from this category