STOCKS

News


నిఫ్టీ మాత్రమే నెగిటివ్‌ రిటర్న్స్‌ ఇచ్చింది!

Thursday 25th July 2019
Markets_main1564038253.png-27310

ప్రపంచ టాప్‌15 మార్కెట్లలో భారత మార్కెట్లదే పేలవ ప్రదర్శన
మేనెల తర్వాత ప్రపంచ టాప్‌ మార్కెట్‌ ప్రదర్శనను పరిశీలిస్తే కేవలం ఇండియా మార్కెట్‌ మాత్రమే ఇప్పటివరకు నెగిటివ్‌ రాబడులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మేలో మోదీ ప్రభుత్వ విజయం అనంతరం భారీ లాభాల్లోకి దూసుకుపోయిన దేశీయ మార్కెట్లు కేవలం రెండు నెలల్లో దాదాపు ఆ లాభాలన్నింటినీ తుడిచిపెట్టాయి. దీంతో డాలర్‌ లెక్కల్లో వరల్డ్‌ టాప్‌ 15 ఈక్విటీ మార్కెట్లలో ఒకే ఒక్క నెగిటివ్‌ మార్కెట్‌గా నిఫ్టీ నిలిచింది. మే నుంచి జూలై మధ్య నిఫ్టీ 2 శాతం పతనమైంది. ఇతర టాప్‌ సూచీలు 18 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. 

టాప్‌ 15 ప్రపంచ సూచీల్లో వర్ధమాన దేశాలైన చైనా, బ్రెజిల్‌, రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా మార్కెట్లు ఈ రెండు నెలల్లో 3- 18 శాతం వరకు లాభాలను నమోదు చేయగా, యూఎస్‌, యూకే, జర్మనీ, జపాన్‌ సూచీలు 3-8 శాతం లాభపడ్డాయి. భారత బడ్జెట్లో సూపర్‌రిచ్‌పై విధించిన సర్‌చార్జ్‌ కారణంగా తాజా అమ్మకాల వెల్లువ వచ్చిందని నిపుణులు భావిస్తున్నారు. పన్ను విధానంలో మార్పు కారణంగా ఎఫ్‌ఐఐలు అమ్మకాలకు దిగారని, భవిష్యత్‌లో వీరు మరలా రావచ్చని, కానీ అంతవరకు వీరి అమ్మకాల కారణంగా డ్యామేజి తప్పదని చౌక్సీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ తెలిపింది. 



You may be interested

బ్యాంకు నిఫ్టీ తీవ్ర హెచ్చుతగ్గులు

Thursday 25th July 2019

ఎస్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ గురువారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. ఉదయం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా నష్టాల్లోకి జారుకుంది. ఇండెక్స్‌ నేడు 28,981.05 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి నేడు ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ షేర్లకు కొనుగోళ్లు నెలకొనడంతో ఇండెక్స్‌ ఓ దశలో 288 పాయింట్లు(1శాతం) పెరిగి 29240.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం మార్కెట్‌లో

కెనరా బ్యాంక్‌ లాభం రూ.329 కోట్లు

Thursday 25th July 2019

17 శాతం వృద్ధి రూ.14,062 కోట్లకు మొత్తం ఆదాయం  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ కెనరా బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.329 కోట్ల నికర లాభం సాధించింది.  గత క్యూ1లో రూ.281 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.329 కోట్లకు పెరిగిందని, 17 శాతం వృద్ధి సాధించామని  కెనరా బ్యాంక్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.13,192 కోట్ల నుంచి రూ.14,062 కోట్లకు పెరిగిందని పేర్కొంది.  వడ్డీ

Most from this category