News


వచ్చే ఏడాది నిఫ్టీ ఎర్నింగ్స్‌ వృద్ధి 12 శాతం..!

Friday 30th November 2018
Markets_main1543573299.png-22530

ముంబై: ప్రస్తుత వాతావరణంలో దీర్ఘకాలిక పెట్టుబడులకు పలు మిడ్‌క్యాప్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని కోటక్ మహీంద్ర అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్, ఈక్విటీ రీసెర్చ్ హెడ్‌ షిబని కురియన్ అన్నారు. వచ్చే 3-5 ఏళ్ల పెట్టుబడి వ్యూహంతో బలమైన వృద్ధి కనబర్చనున్నటువంటి కంపెనీలలో అత్యంత బలమైన యాజమాన్యం కలిగి, మూలధన కేటాయింపు విధానాలు బలంగా ఉండి, ఉన్నతమైన రిటర్న్‌ రేషియోను కలిగిఉన్నటువంటి సంస్థల షేర్లలో పెట్టుబడులు మంచి రాబడిని అందిస్తాయని వ్యాఖ్యానించారు. 2019 ఆర్థిక సంవత్సరంలో నిఫ్టీ ఎర్నింగ్స్‌ వృద్ధి 10-12 శాతం వరకు ఉంటుందన్నారు. గడిచిన సెప్టెంబర్‌ త్రైమాసికంలో నిఫ్టీ కంపెనీలు ఆరోగ్యకర అమ్మకాల వృద్ధిరేటును నమోదుచేసినట్లు చెప్పారు. అయితే, ముడివస్తుల ధరలు పెరగడం వల్ల నికర లాభం నెమ్మదించి ఏడాది ప్రాతిపదికన 10.4 శాతంగా ఉందన్నారు. ఇక తాజాగా ముడిచమురు ధరలు భారీగా పతనం కావడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూరిందని వివరించారు. ద్రవ్యలోటు తగ్గడం, ద్రవ్యోల్బణం తగ్గడం వంటి సానుకూల వాతావరణాన్ని నింపిందన్నారు. టోకు ధ‌ర‌ల ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నందున ఆర్బీఐ డిసెంబరులో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చని విశ్లేషించారు. సాధారణ ఎన్నికలు ఉన్నందు వల్ల ఇంకొంతకాలం ఒడిదుడుకులు ఉండేందుకు ఆస్కారం ఉందని ఒక ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అంతర్జాతీయ అంశాలలో ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలు, బ్రెగ్జిట్‌, అమెరికా-చైనా వాణిజ్య యుద్దం ప్రధానంగా ఉన్నాయన్నారు. డాలర్‌ రూపాయి మారకం విలువ ఈమధ్యకాలంలో బలపడినందున ఐటీ రంగ షేర్లు నష్టపోయాయన్నారు. గడిచిన నెలరోజుల్లో సీఎన్‌ఎక్స్‌ ఐటీ 4 శాతం నష్టపోయి ప్రధాన సూచీతో అండర్‌పెర్ఫార్మ్‌ చేసినప్పటికీ.. గడిచిన ఏడాది పరంగా మాత్రం 20 శాతం లాభపడి అవుట్‌పెర్ఫార్మ్‌ చేసిందన్నారు. లార్జ్‌క్యాప్స్‌లో బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్, టెలికాం రంగాలు మెరుగుపడనున్నాయని సూచించారు.You may be interested

స్వల్పలాభాలతో ముగింపు..!

Friday 30th November 2018

ఆరంభలాభాల్ని హరించిన బ్యాంక్‌, మెటల్‌ షేర్లు ఫార్మా, ఐటీ, అటో షేర్ల అండతో సూచీలు వరుసగా ఐదోరోజూ లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్‌ 24 పాయింట్ల లాభంతో 36,194 వద్ద, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 10,877 వద్ద ముగిశాయి. ముడిచముర ధరల పతనం, రూపాయి ర్యాలీ కారణంగా మార్కెట్‌ మిడ్‌సెషన్‌ వరకు ర్యాలీ చేసింది. మిడ్‌సెషన్‌ నుంచి నెలకొన్న అమ్మకాలతో సూచీలు ఆరంభ లాభాలను నిలుపుకోవడంలో విఫలయ్యాయి. ముఖ్యంగా నిఫ్టీ 10900 పాయింట్ల

పెట్రో షేర్ల పతనం

Friday 30th November 2018

ముంబై:- పెట్రోరంగ కంపెనీ షేర్లు గురువారం ట్రేడింగ్‌లో భారీ పతనమయ్యాయి. ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర క్షీణించిన నేపథ్యంలో భారీ ర్యాలీ జరిపిన ఈ షేర్లలో నేడు లాభాల స్వీకరణ జరుగుతుందని విశ్లేషకుల అంచనా. హెచ్‌పీసీఎల్‌:- నేడు ఎన్‌ఎస్‌ఈలో రూ.242.95ల వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇంట్రాడేలో షేరు 5శాతం పతనమై రూ.230.30ల కనిష్టానికి తగ్గింది. మధ్యాహ్నం గం.2:30లకు షేరు గతముగింపు ధర(రూ.242.90)తో పోలిస్తే 4శాతం లాభపడి రూ.233.40ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే

Most from this category