News


విషమ పరీక్ష దశలో నిఫ్టీ!

Wednesday 9th October 2019
Markets_main1570604884.png-28783

దేశీయ మార్కెట్లు ప్రస్తుతం అత్యంత కీలక పరీక్షా దశలో ఉన్నాయని ప్రముఖ మార్కెట్‌ అనలిస్టు కునాల్‌ బోత్రా అభిప్రాయపడ్డారు. మార్కెట్లన్నీ ట్రెండ్‌ ఆధారంగా నడుస్తుంటాయని, ప్రతి ట్రెండ్‌కు ప్రత్యేకత ఉంటుందని, ప్రతి ట్రెండ్‌లో కొత్త ట్రేడర్లు, ఇన్వెస్టర్లు వస్తుంటారని చెప్పారు. ట్రెండ్‌ ఏదైనా సెంటిమెంట్‌ ఆధారంగానే కొనసాగుతుందని, కానీ ప్రతి ట్రెండ్‌కు ఒక ప్రత్యేక ప్రవర్తనా విధానం ఉంటుందని తెలిపారు. ఇలాంటి ప్రత్యేక ప్రవర్తనా విధానాన్ని టెక్నికల్‌ ఇండికేటర్ల ఆధారంగా గుర్తించవచ్చన్నారు. ఇలాంటి ఇండికేటర్లలో ఆర్‌ఎస్‌ఐ కీలకమైనదని చెప్పారు. ప్రస్తుత మార్కెట్లో ఆర్‌ఎస్‌ఐ గతిని గమనిస్తే మార్కెట్‌ కీలక సంధిదశలో ఉందని అర్ధమవుతోందన్నారు.

ట్రెండ్‌ మార్పుపై ఆయన చెప్పే వివరాలు ఇలా ఉన్నాయి...

2016లో మార్కెట్లలో ర్యాలీ మొదలైంది. అప్పటినుంచి ప్రస్తుత ట్రెండ్‌ కొనసాగుతోంది. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా ఆర్‌ఎస్‌ఐ కదలికలున్నాయి. నాలుగేళ్లుగా నిఫ్టీ ప్రవర్తనా విధానం ప్రకారం కీలక మద్దతు వద్దకు పడినప్పుడుల్లా మంచి బౌన్స్‌ చూపుతూ వచ్చింది. అలాంటి పరిస్థితి ఈదఫా వెంటవెంటనే రెండు సార్లు రావడంతో ఇకపై ట్రెండ్‌ ఎలా కొనసాగుతుందనేది కీలకంగా మారింది. చార్టును పరిశీలిస్తే మూడు ముఖ్య అంశాలు గమనించవచ్చు.
1. బేరిష్‌ డైవర్జెన్స్‌ సెటప్‌ ఏర్పాటు: నిఫ్టీ కదలికలతో హయ్యర్‌ హై, హయ్యర్‌ లో ప్యాట్రన్‌ ఏర్పడింది. ఇందువల్ల ఆర్‌ఎస్‌ఐ బలహీన ట్రెండ్‌ సంకేతాలు ఇస్తోంది.
2. ఆర్‌ఎస్‌ఐ మద్దతురేఖ: నాలుగేళ్లుగా కీలకమైన మద్దతు రేఖ వద్దకు ఆర్‌ఎస్‌ఐ వచ్చినప్పుడల్లా మంచి బౌన్స్‌ వచ్చినట్లు చార్టులో గమనించవచ్చు. ఈ సారి నిర్మలా సీతారామన్‌ ప్రకటనలతో అలాంటి బౌన్స్‌ కనిపించింది. కానీ ఈ బౌన్స్‌ ఎక్కువకాలం కొనసాగకపోవడంతో క్రమంగా మరోమారు ఆర్‌ఎస్‌ఐ మద్దతు రేఖ వద్దకు చేరుతోంది.
3. వాల్యూంల పెరుగుదల: ఇలాంటి మార్కెట్లో వాల్యూంలు పెరగడం ప్రమాదకరం. పొరపాటున నాలుగేళ్ల వాలురేఖ మద్దతు మార్కెట్‌ కోల్పోతే వచ్చే పతనం లోతుగా ఉంటుంది.
పై పరిస్థితులు గమనిస్తే ఇకపై మార్కెట్‌ క్రమంగా ‘‘తగ్గినప్పుడు కొను’’ అనే స్థితి నుంచి ‘‘పెరిగినప్పుడు అమ్ము’’అనే ట్రెండ్‌లోకి మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్‌ఎస్‌ఐ మద్దతు రేఖ నుంచి వేగంగా పైకి కోలుకోవడం జరగకపోతే త్వరలో మార్కెట్‌లో ట్రెండ్‌ పూర్తిగా మారిపోవచ్చు. అందువల్ల వచ్చే ఐదు నెలలు సూచీలకు అత్యంత కీలకంగా భావించాలి. ట్రెండ్‌ మారితే ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి ప్రణాళికలను పునర్నిర్మించుకోవాల్సిఉంటుంది. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 550 పాయింట్లు అప్‌!

Wednesday 9th October 2019

దేశీయ ఈక్విటీ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్‌లో పాజిటివ్‌గా కదులుతున్నాయి. ప్రవేట్‌ బ్యాంక్‌ షేర్లలో కొనుగోలు పెరగడంతో నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ లాభాల్లో ట్రేడవుతోంది. మధ్యాహ్నాం 12.42 సమయానికి నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ 552.85 పాయింట్లు లాభపడి 28,320.40 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 2.07 శాతం లాభపడి రూ. 1,211.50  వద్ద,  ఐసీఐసీఐ బ్యాంక్‌ 2.57 శాతం లాభపడి రూ. 426.80 వద్ద

ఫలితాలకు ముందు నష్టాల్లో టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌

Wednesday 9th October 2019

దిగ్గజ ఐటీ కంపెనీల క్యూ2 ఫలితాలు ఇంకో రెండు రోజులలో రానుండడంతో ఐటీ షేర్లపై ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. ఫలితంగా బుధవారం ట్రేడింగ్‌లో ఐటీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 11.50 సమయానికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 1.18 శాతం నష్టపోయి 15,067.00 వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవీ వెయిట్‌ షేర్లయిన  టీసీఎస్‌ 0.92     శాతం నష్టపోయి రూ. 2,028.85 వద్ద, ఇన్ఫోసిస్‌ 1.30 శాతం నష్టపోయి

Most from this category