News


12430 పాయింట్లు దాటితేనే ర్యాలీ!

Monday 27th January 2020
news_main1580098297.png-31226

నిఫ్టీపై నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లు సోమవారం నెగిటివ్‌గా ఆరంభమయ్యాయి. నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టీకి దాదాపు 12100- 12150 పాయింట్ల రేంజ్‌లో 50 రోజుల డీఎంఏ వద్ద మద్దతు దొరుకుతోంది. ప్రస్తుతానికి నిఫ్టీ స్వల్పకాలిక 5,10, 20 డీఎంఏలకు దిగువన ఉంది. నిఫ్టీకి తక్షణ నిరోధం 12290, 12335 పాయింట్ల వద్ద ఎదురవుతుందని ఎంఎస్‌టీఏ నిపుణుడు మిలాన్‌ వైష్ణవ్‌ చెప్పారు. ఆర్‌ఎస్‌ఐ ప్రస్తుతం న్యూట్రల్‌ నుంచి నెగిటివ్‌ దిశగా వస్తోందన్నారు. ఎంఏసీడీ బేరిష్‌గా మారిందని చెప్పారు. నిప్టీలో బ్రేకవుట్‌రావాలంటే గత టాప్‌ 12430 పాయింట్లను విజయవంతంగా భారీ వాల్యూంలతో అధిగమించాల్సిఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి అంత శక్తి ఉన్నట్లు కనిపించడం లేదని విశ్లేషించారు. ఈ రేంజ్‌ను దాటేంతవరకు నిఫ్టీ పైస్థాయిలకు వచ్చినప్పుడల్లా అమ్మకాల ఒత్తిడిని చూస్తుందన్నారు.

ఈ పరిస్థితుల్లో ఎంపిక చేసిన స్టాకులను ఎంచుకోవడం మంచిదని సూచించారు. అధిక పొజిషన్లకు ప్రస్తుతం దూరంగా ఉండాలని, పైస్థాయిల వద్ద లాభాలను రక్షించుకోవాలని సలహా ఇచ్చారు. నిఫ్టీ 12430ని దాటితే క్రమంగా 12500, 12600 పాయింట్ల వరకు చేరుతుందని, ఇందుకు ముందుగా బుల్స్‌ పట్టు పెరగాలంటే 12320 పాయింట్లను బలంగా దాటాలని మరో అనలిస్టు షబ్బీర్‌ ఖయ్యాం చెప్పారు.



You may be interested

రూ.40,600 పైకి పెరిగిన పుత్తడి

Monday 27th January 2020

గత మూడు నాలుగు రోజులుగా బంగారం ధర స్వల్పంగా పెరుగుతూ వస్తూ సోమవారం నాటికి రూ.40,600  చేరింది. చైనాలో వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ దాటికి స్టాక్‌ మార్కెట్లు పతనం  కావడంతో ఇన్వెస్టర్లు రక్షణాత్మక పెట్టుబడులపై దృష్టి పెట్టడంతో మరోసారి బంగారం ధర పెరిగింది. సోమవారం దేశీయ ఎంసీఎక్స్‌లో  10 గ్రాముల బంగారం  ధర మధ్యహ్నం 3 గంటల ప్రాంతంలో రూ.309 పెరిగి రూ.40,661.00 వద్ద ట్రేడ్‌ అవుతోంది. కాగా  శుక్రవారం

బ్యాంక్‌ నిఫ్టీ 1 శాతం డౌన్‌

Monday 27th January 2020

కరోనా వైరస్‌ ధాటికి ముడిచమురు ధరలతోపాటు.. ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు బలహీనపడుతున్నాయి. మరోపక్క రక్షణాత్మక పెట్టుబడి సాధనాలుగా భావించే పసిడి, జపనీస్‌ కరెన్సీ యెన్‌కు డిమాండ్‌ పెరుగుతోంది. కరోనా వైరస్‌ ఇతర దేశాలకూ పాకుతున్న వార్తలతో తాజాగా జపనీస్‌ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తగా.. యూఎస్‌ ఫ్యూచర్స్‌ సైతం నేలచూపులతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 249 పాయింట్లు క్షీణించి

Most from this category