STOCKS

News


12,300 కీలకం

Thursday 2nd January 2020
Markets_main1577989223.png-30626

శుక్రవారం సెషన్‌లో 12,300 నిఫ్టీకి కీలకమని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్‌ తదుపరి డైరెక్షన్‌కు ఇది కీ పాయింట్‌ అవుతుందంటున్నారు. నిఫ్టీ గురువారం 100 పాయింట్ల వరకు లాభపడినప్పటికీ.. కీలక నిరోధ స్థాయి 12,290ని అధిగమించలేకపోయిందని.. ఈ స్థాయికి పైన నిశ్చయాత్మకంగా క్లోజ్‌ అయితేనే నిఫ్టీ తదుపరి 12,400 మార్క్‌ను చేరుకుంటుందని విశ్లేషిస్తున్నారు. ఒకవేళ కొనుగోళ్ల మద్దతు రాకపోతే మరికొంత స్థిరీకరణ చెందొచ్చని భావిస్తున్నారు.

 

‘‘నిఫ్టీ 12,118-12,293 శ్రేణిలో గత 11 సెషన్లలోనూ స్థిరీకరణకు గురైంది. ఈ స్థాయిని బలంగా అధిగమించడంతోపాటు, తదుపరి కొనుగోళ్ల మద్దతు తోడైతే తాజా ర్యాలీకి దారితీస్తుంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా తెలిపారు. నిఫ్టీ గురువారం 0.82 శాతం లాభంతో 12,282 వద్ద క్లోజయింది. డైలీ చార్ట్‌లో బలమైన బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేయడం గమనార్హం. చార్ట్‌ ప్యాటర్న్‌ను విశ్లేషిస్తే గరిష్ట స్థాయిలను తోసిపుచ్చలేమని, 12,100 కీలకమైన మద్దతు స్థాయిగా కొనసాగుతుందని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ వ్యవస్థాపకుడు మిలాన్‌ వైష్ణవ్‌ పేర్కొన్నారు. 

 

‘‘నిఫ్టీ ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 12,293ను అధిగమించేందుకు ఓ మైలురాయి దూరంలో ఉంది. ఒక్కసారి 12,300ను అధిగమించితే 12,350, ఆ తర్వాత 12,400 దిశగా ర్యాలీ చేస్తుంది’’ అని షేర్‌ఖాన్‌కు చెందిన గౌరవ్‌ తర్నపార్ఖి తెలిపారు. నిఫ్టీకి 12,220-12,200 తక్షణ మద్దతు స్థాయిలుగా పనిచేస్తాయని అంచనా వేశారు. నిఫ్టీ 12,300పైన 30 నిమిషాల కంటే ఎక్కువ సమయం పాటు శుక్రవారం కొనసాగితే లాంగ్‌కు వెళ్లొచ్చని, 12,390 టార్గెట్‌గా చార్ట్‌వ్యూఇండియాకు చెందిన మజర్‌ మహమ్మద్‌ సూచించారు. ఒకవేళ నిఫ్టీ 12,168కి దిగువన క్లోజయితే బలహీనపడుతుందన్నారు. 



You may be interested

చౌకగా మరిన్ని చానళ్లు..

Friday 3rd January 2020

(అప్‌డేటెడ్‌...) ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు ఉచిత చానళ్ల సంఖ్య పెంపు మార్చి నుంచి అందుబాటులోకి న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చార్జీల భారాన్ని కాస్త తగ్గించేలా టెలికం రంగ నియంత్ర౾ణ సంస్థ ట్రాయ్ తాజాగా కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకటించింది. దీంతో మరిన్ని చానళ్లు.. ఇంకాస్త చౌక రేటుకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్ తన వెబ్‌సైట్‌లో ఉంచిన ఆర్డరు ప్రకారం.. ఉచిత చానళ్ల సంఖ్య పెరగనుండగా, పే చానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ చానళ్లను

రూ.లక్ష కోట్లతో.. లాభపడే కంపెనీలు

Thursday 2nd January 2020

మౌలిక రంగ ప్రాజెక్టులపై 2024 నాటికి రూ.105 లక్షల కోట్లను ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో మౌలిక రంగంలోని కంపెనీలు సమీప భవిష్యత్తులో ఇన్వెస్టర్లకు మంచి అవకాశాలను ఇస్తాయనే విశ్లేషణనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని ప్రకటించినప్పటికీ... ఆచరణలో మాత్రం ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులే వ్యయాలను నిర్దేశిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.    ‘‘ప్రభుత్వ లక్ష్యం ఎంతో ప్రతిష్టాత్మకమైనది. గత పదేళ్ల కాలంలో మౌలిక సదుపాయాలపై

Most from this category