మార్కెట్లో నెగిటివ్ రియాక్షన్
By D Sayee Pramodh

కొత్త బడ్జెట్ పూర్తయిన తర్వాత దేశీయ మార్కెట్లు నెగిటివ్ మూడ్‌లోకి మారాయి. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 11800 పాయింట్ల దిగువన 11798 పాయింట్ల కనిష్ఠాన్ని తాకింది. ప్రస్తుతం 11840 పాయింట్ల వద్ద నిఫ్టీ, 39600 పాయింట్ల వద్ద సెన్సెక్స్ కదలాడుతున్నాయి. అడ్వాన్స్, డిక్లైన్ నిష్పత్తి 845:1298గా ఉంది. ఐబీహౌసింగ్, ఇండస్‌ఇండ్‌బ్యాంక్, ఎయిర్టెల్ లాభాల్లో ఉండగా, యస్‌బ్యాంక్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీలు నష్టాల్లో ఉన్నాయి. రంగాల వారీగా నిఫ్టీ మెటల్స్ భారీగా 2.7 శాతం నష్టపోగా, రియల్టీ సూచీ 1.78 శాతం పతనమైంది. పీఎస్‌యూ బ్యాంకులు మాత్రమే పాజిటివ్‌గా ఉన్నాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు దాదాపు 5- 6 శాతం క్షీణించాయి. మిడ్‌క్యాప్ సూచీ అరశాతం, స్మాల్‌క్యాప్ సూచీ 0.7 శాతం క్షీణించాయి.
You may be interested
గేరు మార్చు... స్పీడు పెంచు
Friday 5th July 2019- భారత్ టేకాఫ్‌కు ఇదే సరైన సమయం - నిలకడగా 8 శాతం వృద్ధి సాధించాలి - ఇందుకు సంస్కరణల ఊతం కావాలి - అప్పుడే 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ సాధ్యం - ప్రైవేట్ పెట్టుబడులు, ఎగుమతులు, ఉద్యోగాలే కీలకం - ఈసారి వృద్ధి రేటు మాత్రం 7 శాతంగా ఉండొచ్చు - చమురు ధరలు మరింత తగ్గే అవకాశముంది - పెరగనున్న డిమాండ్, బ్యాంక్ రుణాలు - చిన్న సంస్థలు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలి - ఎకానమీపై
పీఎస్‌యూ బ్యాంకులకు రూ.70వేల కోట్ల రీ క్యాపిటలైజేషన్: లాభాల్లో పీఎస్‌యూ బ్యాంకు షేర్లు
Friday 5th July 2019ప్రస్తుత బడ్జెట్లో ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.70,000కోట్ల రీ క్యాపిటలైజేషన్ ప్రకటించడంతో ఈ రంగ షేర్లు నష్టాల్లోంచి లాభాల్లోకి మళ్లాయి. నేడు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఇండెక్స్ 3,313.90 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్ ప్రారంభంలో ఈ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో 1శాతం నష్టపోయి 3,260.60స్థాయికి పతనమైంది. ప్రభుత్వరంగ బ్యాంకుల పునరుద్ధరణలో భాగంగా బడ్జెట్లో రూ.70,000కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. గత నాలుగేళ్ల కాలంలో దేశీయ బ్యాంకింగ్