News


కళతప్పిన మెటల్‌ షేర్లు

Friday 27th September 2019
Markets_main1569571166.png-28588

అంతర్జాతీయంగా మెటల్‌ షేర్ల పతన ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ మెటల్‌ షేర్లు నష్టాల బాట పట్టాయి. అమెరికాతో వాణిజ్య వివాదాలు కార్పొరేట్ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపడంతో ఆగస్ట్‌లో చైనా దేశపు ఇండస్ట్రీయల్‌ ప్రాఫిట్స్‌ 2శాతం తగ్గినట్లు నేడు చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ప్రకటించింది. మరోవైపు ఇరుదేశాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు మధ్య ఈ అక్టోబర్‌ ప్రారంభంలో వాణిజ్య చర్చలు ప్రారంభంకానున్నాయి. ఇరు దేశాలు మధ్యంతర ఒప్పందాన్ని కుదుర్చుకోగలవని ఇన్వెస్టర్లు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా నేడు దేశీయ మెటల్‌ షేర్లలో అధిక వెయిటేజీ కలిగిన జిందాల్‌ స్టీల్‌, వేదాంత, సెయిల్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్ల భారీగా పతనంతో ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ శుక్రవారం 3శాతం మేర పడిపోయింది. మధ్యాహ్నం గం.12:15ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2,520.45)తో పోలిస్తే 2.50శాతం నష్టపోయి 2,454.85 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన వేదాంత, జిందాల్‌ స్టీల్‌ షేర్లు 5శాతం క్షీణించాయి. టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా, సెయిల్‌, హిందాల్లో షేర్లు 4శాతం నుంచి 3శాతం నష్టపోయాయి. నాల్కో, హిందూస్థాన్‌ కాపర్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు 2నుంచి 1శాతం వరుకు నష్టపోయాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లో మెయిల్‌ షేర్లు అత్యధికంగా 6.50శాతం లాభపడింది. అలాగే ఎన్‌ఎమ్‌డీసీ, హిందూస్థాన్‌ జింక్‌, ఏపిఎల్‌ అపోలో షేర్లు 1.50శాతం నుంచి అరశాతం పెరిగాయి.

ఇదే సమయానికి ప్రధాన సూచీలైన నిఫ్టీ ఇండెక్స్‌ 27 పాయింట్ల నష్టంతో 11,550 దిగువున 11,543.60 వద్ద, సెన్సెక్స్‌ 55 పాయింట్లను కోల్పోయి 39000 దిగువున 38935.05 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 



You may be interested

క్యూ4లో కార్పొరేట్‌ లాభాలు కొత్త గరిష్టానికి !

Friday 27th September 2019

‘ప్రభుత్వం, కార్పోరేట్‌ ట్యాక్స్‌ను తగ్గించడంతో వ్యవస్థలో మూలధన వ్యయ చక్రం తిరిగి పుంజుకుంటుంది. దీంతో కంపెనీల లాభాల వృద్ధి పెరుగుతాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి సహాయపడుతుంది’ అని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ సీఈఓ రాజీవ్‌ సింగ్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. అతి పెద్ద సంస్కరణ.. కార్పోరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు చర్యను  1991 తర్వాత అతిపెద్ద ఆర్థిక సంస్కరణగా చెప్పుకోవచ్చు. ముందు

స్థిరంగా పసిడి ధర

Friday 27th September 2019

ప్రపంచమార్కెట్లో పసిడి శుక్రవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్‌ అవుతోంది. ఆసియాలో ఔన్స్‌ పసిడి 2 డాలర్ల స్వల్ప నష్టంతో 1,513.35డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. పసిడి ఇన్వెస్టర్లు అగ్రరాజ్యమైన అమెరికా ప్రతినిధుల సభలో ఆ దేశాధ్యక్షుడైన ట్రంప్‌పై అభిశంసన తీర్మానం అంశంపై, అమెరికా-చైనాల వాణిజ్య చర్చల పరిణామాలపై దృష్టిని సారించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ట్రంప్ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల నిమిత్తం అధికార దుర్వినియోగానికి పాల్పడ్డట్లు

Most from this category