News


కరుగుతున్న మెటల్‌ షేర్లు

Thursday 18th July 2019
Markets_main1563435567.png-27157

  • 2శాతం క్షీణించి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 

నష్టాల మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా గురువారం మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. అంతర్జాతీ వృద్ధి ఆందోళనలు తెరపైకి రావడం ఇందుకు కారణమవుతున్నాయి. గత నెలలో జీ-20 సదస్సులో జరిగిన ఒప్పందం ప్రకారం అమెరికా వ్యవసాయ ఉత్పుత్తులను చైనా ఎందుకు కొనుగోలు చేయడం లేదని ట్రంప్‌ ప్రశ్నించారు. అవసరమైతే వాషింగ్టన్ అదనంగా 325 బిలియన్ల విలువైన చైనా వస్తువులపై సుంకాలను విధింపునకు వెనకాడదని హెచ్చరించారు. దీనిపై స్పందించిన బీజింగ్‌ వాణిజ్య అధికారులు ఇరుదేశాల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా పాటించాల్సిన అవరసం ఉందని తెలిపారు. అదనపు టారీఫ్‌ల బెదింరింపులు ఇరు దేశాలకు మంచిదని కాదని బీజింగ్‌ అధికార ప్రతినిధులు తెలిపారు. దీంతో ఇరుదేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరోసారి తెరపైకి వచ్చినట్లైంది. ఫలితంగా ప్రపంచ ఆర్థిక వృద్ది ఆందోళనలు రేకెత్తడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ నేటి ట్రేడింగ్‌లో 2శాతం క్షీణించింది. ముఖ్యంగా ఇండెక్స్‌లో అధిక వెయిటేజీ కలిగిన వేదాంత, వెల్‌స్పన్‌ కార్ప్‌,  కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు పతనం ఇండెక్స్‌ భారీ క్షీణతకు కారణమైంది. మధ్యహ్నం గం.12:30నిల.కు కోల్‌ ఇండియా ఇండెక్స్‌ గతముగింపు(2,848.80)తో పోలిస్తే 2శాతం క్షీణించి 2,791.35 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇండెక్స్‌లో అధికంగా కోల్‌ ఇండియా, వేదాంత షేర్లు 3శాతం క్షీణించాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటాస్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, సెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 2శాతం వరకు నష్టపోయాయి. జేఎస్‌ఎల్‌ హిస్సార్ స్టీల్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌, నాల్కో, ఏపిల్‌అపోలో, హిందూస్థాన్‌ కాప్‌, హిందాల్కో షేర్లు 1.50శాతం క్షీణించాయి. మెయిల్‌ షేర్లు అరశాతం పతనమయ్యాయి. ఎన్‌ఎండీసీ షేర్లు మాత్రం అరశాతం లాభపడ్డాయి.

ఇదే సమయానికి సెన్సెక్స్‌ 140 పాయింట్ల నష్టంతో 39,075 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు క్షీణించి 11,641.75 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 



You may be interested

11770 వద్ద నిఫ్టీకి నిరోధం

Thursday 18th July 2019

మార్కెట్లు బడ్జెట్‌ అనంతరం పతనం చవిచూసి ప్రస్తుతం కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి మారాయి. కొన్ని రోజులుగా నిఫ్టీ 11460 పాయింట్లను కాపాడుకుంటూ చిన్నపాటి బౌన్స్‌ బ్యాక్‌ చూపింది. ప్రస్తుతానికి నిఫ్టీ ట్రెండ్‌ స్వల్పంగా పాజిటివ్‌గానే ఉందని, కానీ సూచీల్లో జోరు కనిపించడం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రెండు రోజులుగా మార్కెట్లో లిక్విడిటీ కొరత కారణంగా చిన్న కదలికలే నమోదు కావడం గమనించవచ్చన్నారు. చార్టుల్లో స్పిన్నింగ్‌ టాప్‌ క్యాండిల్‌ ఏర్పడి ట్రెండ్‌ న్యూట్రల్‌గా

ఆటో ఇండెక్స్‌ నష్టాల్లో..

Thursday 18th July 2019

అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతుండడంతో ఆ ప్రభావం దేశి ఈక్విటీ మార్కెట్లపై పడింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ గురువారం ట్రేడింగ్‌లో 1.67 శాతం నష్టపోయి 7,520.70 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో భారత్‌ ఫోర్జ్‌ 4.92 శాతం, టాటా మోటర్స్‌ 3.19 శాతం, అశోక్‌ లేలాండ్‌ 2.87 శాతం, మదర్‌ సుమీ 2.24 శాతం, మారుతి 2.15 శాతం, టీవీఎస్‌ మోటర్స్‌ 1.67 శాతం, అపోలో టైర్స్‌ 1.60

Most from this category