News


కరుగుతున్న మెటల్‌ షేర్లు

Wednesday 21st August 2019
Markets_main1566376792.png-27921

2.50 శాతం క్షీణించిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌
మార్కెట్‌ పతనంలో భాగంగా మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ దాదాపు 3శాతం క్షీణించింది. నేడు ఇండెక్స్‌ 2,340.35 వద్ద ప్రారంభమైంది. ట్రేడ్‌వార్‌ కారణంగా చైనాలో మెటల్‌ నిల్వలు పెరగడటం, ధరలు క్షీణించడంతో అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఇదే ట్రెండ్‌ దీర్ఘకాలం పాటు కొనసాగవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే మైనింగ్‌ దిగ్గజం బీహెచ్‌పీ గ్రూప్‌ స్టీల్‌తయారీ ముడిపదార్థాల ధరలపై డౌన్‌బీట్‌ అవుట్‌లుక్‌ కేటాయించడంతో చైనా దేశపు ఐరన్‌ ఓర్‌ ధరలు 10వారాలు కనిష్టానికి పతమయ్యాయి. ఈ నేపథ్యంలో నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.60శాతం క్షీణించి 2,282.80 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ఇండెక్స్‌లో అత్యధికంగా సెయిల్‌ కంపెనీ షేర్లు 7.50శాతం నష్టపోయాయి. జిందాల్‌ స్టీల్‌ 5శాతం, ఎన్‌ఎండీసీ 4.50శాతం, టాటాస్టీల్‌, జేఎస్‌ఎల్‌హిస్సార్‌ స్టీల్‌ షేర్లు 4శాతం నష్టపోయాయి. హిందూస్థాన్‌ కాపర్‌, నాల్కో, కోల్‌ ఇండియా షేర్లు 3శాతం పతనమయ్యాయి. వేదాంత, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, హిందాల్కో, మెయిల్‌, హిందూస్థాన్‌ జింక్‌, వెల్‌స్పన్‌ కార్ప్‌ షేర్లు 1.50శాతం నుంచి 1శాతం క్షీణించాయి. కేవలం ఏపిల్‌అపోలో షేర్లు అరశాతం స్వల్ప లాభంతో ట్రేడ్‌ అవుతోంది. 
అంతర్జాతీయంగా మెటల్‌ ధరలు క్షీణించడం, దేశీయ మందగమన ఆందోళనలు దేశీయ కంపెనీల ఆదాయాలు, నికర లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గత నెల రోజుల్లో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 14.3శాతం మేర నష్టపోయింది. ఏడాది కాల వ్యవధిలో మెటల్‌ ఇండెక్స్‌ 32శాతం క్షీణించింది. ఇందులో అత్యధికంగా సెయిల్‌ షేర్లు 55శాతం నష్టపోగా, జేఎస్‌సీఎల్‌ 49శాతం, టాటాస్టీల్‌ 40శాతం, వేదాంత 36శాతం మేర పతనయ్యాయి. 



You may be interested

టాటామోటర్స్‌ షేర్ల రివర్స్‌ గేర్‌..!

Wednesday 21st August 2019

10శాతం క్షీణించిన షేర్లు  దేశీయ వాహన తయారీ రంగ దిగ్గజ కంపెనీ టాటామోటర్స్‌ షేర్లు బుధవారం ట్రేడింగ్‌లో 10శాతం క్షీణించాయి. ట్రేడ్‌వార్‌ ప్రభావంతో కంపెనీ అనుబంధ సంస్థ  జేఎల్‌ఆర్‌ ఆదాయాలు క్షీణించడం, కేర్‌ రేటింగ్‌ సం‍స్థ కంపెనీ దీర్ఘకాలిక రేటింగ్‌ ఎఎ నుంచి ఎఎ(-)కు డౌన్‌గ్రేడ్‌ చేయడంతో పాటు నెగిటివ్‌ అవుట్‌లుక్‌ను కేటాయించడం, ప్రపంచవ్యాప్తంగా అటో రంగ బలహీనంగా ఉండటం షేర్ల పతనానికి కారణమయ్యాయి. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేర్లు

గోల్డ్‌పై రిటర్న్‌లను అంచనావేయొచ్చు: డబ్యూజీసీ

Wednesday 21st August 2019

వడ్డీ రేట్లు ప్రతికూలంగా మారడంతో పాటు అంతర్జాతీయంగా ఆర్థిక మార్కెట్లు అనిశ్చితిలో ఉండడంతో గత 10 నెలల నుంచి బంగారం, ఇతర ప్రధాన ఆస్తుల కంటే సురక్షితంగా మారిందని, ప్రపంచవ్యాప్తంగా బంగారం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ యుఎస్(డబ్యూజీసీ), మేనేజింగ్ డైరెక్టర్ జోసెఫ్ కావటోని అన్నారు. బంగారం ధర ఈ పదినెలలో దాదాపు 25 శాతం పెరిగిందని తెలిపారు. ‘అభివృద్ధి చెందిన మార్కెట్లలో, 70

Most from this category