News


నష్టాల్లో జిందాల్‌, వేదంతా, హిందల్కో

Wednesday 28th August 2019
Markets_main1566970097.png-28069

యుఎస్‌-చైనా ఒప్పందం గురించి మాట్లాడడానికి యుఎస్‌ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఫోన్‌ కాల్స్‌ చైనా ప్రభుత్వానికి రాలేదని, యుఎస్‌ ఇలాంటి తప్పుడు చర్యలను ఆపి, చర్చలకు ఉపకరించే పరిస్థితిని తీసుకురావలని చైనా వైస్ ప్రీమియర్ లియు హి అన్నారు. ఫలితంగా ట్రేడ్‌ వార్‌ ఆందోళనలు ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో దేశియ మార్కెట్లు కూడా నెగిటివ్‌లో ఉన్నాయి. ఉదయం 10.43 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2 శాతం నష్టపోయి 2,257.75 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో జిందాల్‌ స్టీల్‌ 3.99 శాతం, సెయిల్‌ 3.20 శాతం, టాటా స్టీల్‌ 2.78 శాతం, హిందుస్థాన్‌  కాపర్‌ 2.48 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 2.58 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ 2.40 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 2.39 శాతం, మొయిల్‌ 2.16 శాతం, వేదాంత 1.96 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 1.47 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 1.41 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ (హిసార్‌) 1.30 శాతం, కోల్‌ ఇండియా 0.60 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ 0.19 శాతం నష్టపోయి ట్రేడవుతుండగా, వెల్సపన్‌ కార్ప్‌ మాత్రం 0.26 శాతం లాభపడి ట్రేడవుతోంది.



You may be interested

పసిడిలో లాభాల స్వీకరణ

Wednesday 28th August 2019

ప్రపంచ ఆర్థిక మాంద్య భయాలతో కిత్రం ట్రేడింగ్‌లో ఆరేళ్ల గరిష్ట ధరపై ట్రేడైన పసిడి ధర బుధవారం స్వల్పంగా నష్టపోయింది. ఆరేళ్ల గరిష్టం వద్ద ట్రేడర్లు లాభాల స్వీకరణ చోటుచేసుకోవడం ఇందుకు కారణమైంది. చైనా-అమెరికాల మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధ ఉద్రికత్తలు, అమెరికా రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత విధింపు అంచనాలతో పసిడి ధర ఇప్పటికీ ఆరేళ్ల గరిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియా ట్రేడింగ్‌లో ఔన్స్‌

రాష్ట్రాల్లో పన్నులు అధికం

Wednesday 28th August 2019

కార్ల ధరలపై ప్రభావం  వృద్ధి విషయంలో రాష్ట్రాలది పెద్ద బాధ్యత మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ భార్గవ వెల్లడి  ముంబై: రాష్ట్రాల్లో పన్నులు అధికంగా ఉన్నాయని, ఫలితంగా కార్ల ధరలు పెరుగుతున్నాయని మారుతీ సుజుకీ ఇండియా చైర్మన్‌ ఆర్‌.సి. భార్గవ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు పెట్రోల్‌పై రాష్ట్రాలు భారీగా పన్నులు విధిస్తున్నాయని, కొన్ని రాష్ట్రాలు రోడ్డు ట్యాక్స్‌ను బాగా పెంచాయని, ఫలితంగా కార్ల ధరలపై రాష్ట్రాల పన్ను భారం ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు.

Most from this category