STOCKS

News


లాభాల్లో కోల్‌ ఇండియా, టాటాస్టీల్‌, వేదాంత

Thursday 5th September 2019
Markets_main1567658194.png-28207

యుఎస్- చైనా ఇరు దేశాల అధ్యక్షులు  ఉదయం ఫోన్‌లో మాట్లాడారని, అంతేకాకుండా అక్టోబర్ ప్రారంభంలో మరో రౌండ్ వాణిజ్య చర్చల కోసం సమావేశానికి అంగీకరించారని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లు పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. దీంతోపాటు దేశియ బెంచమార్క్‌ సూచీలు కూడా సానుకూలంగా ట్రేడవుతుండడంతో ఉదయం 9.55 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2.38 శాతం లాభపడి 2,308.30 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 4.69 శాతం, కోల్‌ ఇండియా 4.34 శాతం, వేదాంత 2.71 శాతం, టాటా స్టీల్‌ 2.45 శాతం, మొయిల్‌ 2.41 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 1.96 శాతం, హిందుస్థాన్‌  కాపర్‌ 1.75 శాతం, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ (హిసార్‌) 1.58 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 1.35 శాతం, నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 1.26 శాతం, జిందాల్‌ స్టీల్‌ 1.15 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ 1.02 శాతం, సెయిల్‌ 0.93 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 0.21 శాతం లాభపడి ట్రేడవుతుండగా,  ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ మాత్రం 0.18 శాతం నష్టపోయి ట్రేడవుతోంది.You may be interested

71.86 వద్ద ప్రారంభమైన రూపీ

Thursday 5th September 2019

రూపీ డాలర్‌ మారకంలో గురువారం ట్రేడింగ్‌లో 26 పైసలు బలపడి 71.86 వద్ద ప్రారంభమైంది. దేశియ ఈక్విటీ మార్కెట్లు గత సెషన్‌లో రికవరి అయ్యాక రూపీ కూడా డాలర్‌ మారకంలో 27 పైసలు బలపడి 72.12 వద్ద ముగిసింది. ‘దేశియ ఈక్విటీ మార్కెట్‌ పాజిటివ్‌గా ముగియడం, రూపీ బలపడడంలో సహాయపడింది. గత సెషన్‌లో రూపీ-డాలర్‌ ఎన్‌ఎస్‌ఈ సెప్టెంబర్‌ కాంట్రాక్ట్‌  72.29 గా ఉంది. అదే విధంగా ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ 2.21

పెరిగిన యుఎస్‌ చమురు నిల్వలు..తగ్గిన చమురు

Thursday 5th September 2019

గత వారానికి సంబంధించి యుఎస్‌ చమురు నిల్వలు పెరగడంతో గురువారం ట్రేడింగ్‌లో చమురు ధరలు పడిపోయాయి. బ్రెంట్‌ క్రూడ్‌ 0.3 శాతం పడిపోయి బారెల్‌ 60.52 డాలర్లకు, డబ్యూటీఐ క్రూడ్‌ 0.4 శాతం తగ్గి బారెల్‌ 56.03 డాలర్లకు చేరుకున్నాయి. అగష్టు 30 తో ముగిసిన వారానికిగాను యుఎస్‌ చమురు నిల్వలు తగ్గుతాయని విశ్లేషకులు అంచనాల నేపథ్యంలో, గత సెషన్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ 4.2 శాతం, డబ్యూటీఐ క్రూడ్‌ 4.3

Most from this category