STOCKS

News


అమ్మకాల ఒత్తిడిలో మెటల్‌ షేర్లు

Tuesday 21st January 2020
Markets_main1579594977.png-31072

  • 1శాతం నష్టాన్ని చవిచూసిన నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 
  • 3శాతం క్షీణించి ఎన్‌ఎండీసీ

మార్కెట్‌ పతనంతలో భాగంగా మంగళవారం మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఫలితంగా ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ కల్లా 1శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,823.65 వద్ద మొదలైంది. మార్కెట్లో నెలకొన్న అమ్మకాలతో మెటల్‌ షేర్లు ఉదయం సెషన్‌లో భారీగా నష్టాలను చవిచూశాయి. ఒకదశలో దాదాపు 1శాతం నష్టపోయి 2809.00 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని అందుకుంది. మధ్యాహ్నం గం.1:30ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(2835.85)తో పోలిస్తే 0.71శాతం నష్టంతో 2,815.80 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయంలో ఇండెక్స్‌లో ప్రధాన షేర్లైన ఎన్‌ఎండీసీ అత్యధికంగా 3శాతం నష్టపోయింది. టాటాస్టీల్‌, హిందూస్థాన్‌ జింక్‌, మెయిల్‌, నాల్కో షేర్లు 2శాతం నష్టపోయాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హిందూస్థాన్‌ కాపర్‌, సెయిల్‌, వేదాంత, వెల్‌స్పన్‌ కార్ప్‌, హిందూస్థాన్‌ జింక్‌ షేర్లు 1శాతం నష్టపోయాయి. మరోవైపు జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, ఏపిఎల్‌ అపోలో షేర్లు 3శాతం లాభపడ్డాయి. రత్నమని లిమిటెడ్‌, హిందాల్కో షేర్లు 1.50శాతం లాభపడ్డాయి. 



You may be interested

ఎస్‌బీఐ హోం బయ్యర్‌ గ్యారెంటీ స్కీమ్‌

Tuesday 21st January 2020

గృహరుణాల్లో ఎస్‌బీఐ ఆర్‌బీబీజీ స్కీమ్‌! ముంబై: దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గృహరుణాలు పొందే కస్టమర్లకు సరికొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే  రెసిడెన్షియల్‌ బిల్డర్‌ ఫైనాన్స్‌ విత్‌ బయ్యర్‌ గ్యారెంటీ(ఆర్‌బీబీజీ స్కీమ్‌) స్కీమ్‌. ఈస్కీమ్‌తో ఎస్‌బీఐ వద్ద గృహరుణాలు తీసుకునే కస్టమర్లకు ప్రాజెక్ట్‌ గ్యారెంటీని అందిస్తుంది.అంటే  ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ లో ఇల్లు కొనుక్కోవడానికి ఎస్‌బీఐలో లోను తీసుకుంటే ఆ ప్రాజెక్ట్‌ మధ్యలో ఆగిపోకుండా పూర్తి

నష్టాల మార్కెట్లో మిడ్‌ క్యాప్స్‌ దూకుడు

Tuesday 21st January 2020

అపోలో ట్రైకోట్‌ ట్యూబ్స్‌ కేన్‌ ఫిన్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కేఈఐ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ సెంచురీ టెక్స్‌టైల్స్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) తాజాగా ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను కుదించడంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. వర్ధమాన దేశాలలో భారత్‌ జీడీపీ మందగించడం ప్రభావం చూపనున్నట్లు ఐఎంఎఫ్‌ పేర్కొంది. దీంతో ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అమ్మకాలు పెరిగి మార్కెట్లు వెనకడుగు వేశాయి. మధ్యాహ్నం 12.40 ప్రాంతంలో సెన్సెక్స్‌ 147 పాయింట్లు క్షీణించి 41,382ను తాకగా.. నిఫ్టీ 39 పాయింట్ల

Most from this category