News


కళ తప్పిన మెటల్‌ షేర్లు

Monday 24th June 2019
Markets_main1561361407.png-26529

మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు స్తబ్దుగా సాగుతాయి. మార్కెట్‌ ట్రేడింగ్‌లో భాగంగా మెటల్‌ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతం వరకు నష్టపోయింది. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,932.85ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఇండెక్స్‌ మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1శాతం క్షీణించి 2898.00ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి పతనమైంది. ఇండెక్స్‌లో అత్యధికంగా వేదాంత 3శాతానికి పైగా నష్టపోయింది. జిందాల్‌ స్టీల్‌ 3శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 2.50శాతం, టాటాస్టీల్‌, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, సెయిల్‌ షేర్లు 2శాతం క్షీణించాయి. హిందూస్థాన్‌ జింక్‌, మెయిల్‌, నాల్కో, ఎన్‌ఎండీసీ షేర్లు అరశాతం వరకు పతనమయ్యాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని కోల్‌ ఇండియా 1.50శాతం లాభపడింది. హిందాల్కో, హిందూస్థాన్‌ కాపర్‌, అపోలో, వెల్‌స్పన్‌కార్ప్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం గం.12:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(2,930.20    )తో పోలిస్తే 1శాతం నష్టంతో 2,902.70 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

ఇదే సమయానికి సెన్సెక్స్‌ 5పాయింట్ల లాభంతో 39,189 వద్ద, నిఫ్టీ 3 పాయింట్‌ స్వల్ప నష్టంతో 11,727 వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

నేడే జలాన్‌ ప్యానెల్‌ నివేదిక!

Monday 24th June 2019

ఆర్‌బీఐ మిగులు నిధులను క్రేంద్రానికి బదిలీ చేసేలా సిఫార్సులుంటాయని అంచనా ఆర్‌బీఐ మిగులు నిధుల వినియోగానికి సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ఏర్పాటైన జలాల్‌ ప్యానెల్‌ సోమవారం నివేదిక సమర్పించనుంది. ఆర్‌బీఐ వద్ద ఉన్న అదనపు మిగులు నిధులను(సుమారు లక్ష నుంచి ఐదు లక్షల కోట్ల రూపాయలు) కేంద్రానికి ఇచ్చేందుకు ప్యానెల్‌ పచ్చజండా ఊపవచ్చని బ్రోకరేజ్‌లు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిధులతో పీఎస్‌యూ బ్యాంకులను రీక్యాప్‌ చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ విధంగా

ఏడాది కనిష్ఠాన్ని తాకిన 117 స్టాక్‌లు

Monday 24th June 2019

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలోని 117 స్టాక్‌లు సోమవారం ట్రేడింగ్‌లో తమ ఏడాది కనిష్ఠాన్ని తాకాయి. ఎక్సేల్యా సొల్యుషన్స్‌ ఇండియా, ఆర్షియా, బన్నారి అమ్మన్‌ స్పిన్నింగ్‌ మిల్స్‌, బినాని ఇండస్ట్రీస్‌, భారత్‌ రోడ్‌ నెట్‌వర్క్‌ స్టాక్‌లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు కాక్స్‌ అండ్‌ కింగ్స్‌, ఈమామి, ఈమామి పేపర్ మిల్స్‌, జీకేవీ, గ్లెన్‌మార్క్‌ పార్మా, ఐఎఫ్‌జీఎల్‌ రిఫ్రాక్సరిస్‌, జే భారత్‌ మారుతి, లుమెక్స్‌ ఇండస్ట్రీస్‌, సామ్‌ డిస్టిలరీస్‌ అండ్‌ బ్రేవరీస్, టీవీఎస్‌

Most from this category